Nuvvunte Naa Jathaga Serial Today Episode: దేవా  వస్తే నిశ్చయ తాంబూళాలు  జరిగినట్లేనన్న త్రిపుర మాటలతో  రిషి అయోమయానికి గురవుతాడు. అతడు వస్తే నిశ్చితార్థానికి వచ్చిన ప్రాబ్లం ఏంటని అంటాడు. అతను ఎప్పుడూ ఎవరితోనే గొడవ పెట్టుకుంటూ ఉంటాడు కదా...ఇక్కడ కూడా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని అంటారు. అతను కారణం లేకుండా ఎవరితోనూ  ఎప్పుడూ  గొడవ పడడని రిషి అంటాడు. దీనికి మిధున తండ్రి ఇది మన రెండు కుటుంబాల మధ్య జరుతున్న ఫంక్షన్‌ అని బయట వాళ్లు ఎందుకు  అంటాడు.

Continues below advertisement

దేవా నాకు బయటివాడు కాదని....సొంత ఇంటి మనుషుల కన్నా ఎక్కువ అంటాడు రిషి. అతనికి ఫోన్ చేద్దామని చూడగా..ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయిందని నీ ఫోన్‌ ఒకసారి ఇవ్వవా అంటాడు.ఆమె ఫోన్ ఇవ్వగా....అందులో దేవా నెంబర్‌ రిషి డయల్‌ చేస్తాడు. అప్పటికే దేవా నెంబర్‌ మొగుడ్స్‌ అని ఫీడ్‌ చేసుకుని ఉండటం గమనించి ఇదేంటి అని రిషి అడుగుతాడు. నీ మొబైల్‌లో దేవా నెంబర్ ఎందుకు  ఉందని...అది కూడా మొగుడ్స్‌ అని ఎందుకు సేవ్ చేసుకున్నావ్ అంటాడు. దీంతో మిధున చెల్లి కలుగజేసుకుని...సారీ బావ నీ ప్రెండ్‌ నెంబర్‌  మొగుడ్స్ ప్రెండ్‌ అని సేవ్‌ చేయబోయి....మొగుడ్స్‌ అని నేనే సేవ్‌ చేశానని చెబుతుంది. అయినా దేవా నెంబర్‌ నీ దగ్గర ఎందుకు ఉంది..నువ్వు నాతోనే కదా దేవాను కలిసింది. నీకు దేవా నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది. అంతకు ముందు వాడు నీకు తెలియదన్నావు కదా...మరి ఈ నెంబర్ ఎవరు ఇచ్చారు అని రిషి అడుగుతాడు. అప్పుడు మిధున చెల్లి కలుగజేసుకుని నువ్వే ఇచ్చావు బావ...నీకు గుర్తులేదనుకుంటా అని చెబుతుంది. ఇక అందరూ కలిసి గుడిలోకి వెళ్లిపోతారు.                    

పెళ్లి శుభలేఖలకు పూజ చేయించేందుకు భానుని తీసుకుని దేవా అదే గుడికి వస్తాడు. దీంతో భానుమతి ఆనందానికి అవదలు లేవు. ఇంతలో దేవా అక్కడికి వచ్చినట్లు  మిధునకు అనిపిస్తుంది. అదే విధంగా దేవాకు కూడా  మిధున ఇక్కడే ఉన్నట్లు తోస్తుంది. మిధున కంగారు చూసిన వాళ్ల చెల్లి...ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా ఇంకా ఎందుకు ఈ భయమని అంటుంది. దీనికి మిధున మండిపడుతుంది. అబద్ధం చెప్పి పెళ్లిచేసుకోవడం సులువే కానీ...మోసం చేసి చేసుకున్నామన్న ఫీలింగ్ మోయడం కష్టమంటుంది. ఇలా ఎన్నాళ్లని మోసం చేస్తూ బతుకుతాం అంటుంది. అబద్ధం చెప్పక...నీ మెడలో బలవంతంగా తాళి కట్టింది దేవానేనని చెప్పమంటావా అని అంటుంది.

Continues below advertisement

ఏదో ఒకరోజు తెలిస్తే అని మిధున అనగా...ఆ రోజు చూసుకుందాంలే అంటుంది. ఆరోజు ఎందుకు చెప్పలేదని రిషి అడిగితే ఏం చెప్పమంటావు. మనం అందరం రిషి దృష్టిలోమోసగాళ్లలా  మిగిలిపోకూడదనుకుంటే..నేను ఇప్పుడే  అతనికి నిజం చెప్పేస్తానని మిధున అంటుుంది.  ఆ నిజం చెబితే వెంటనే పెళ్లి ఆగిపోతుందని చెల్లి వారిస్తుంది. అయినప్పటికీ నేను నిజం చెబుతానని అంటుంది. దేవా కంటే మంచోడు ఈలోకం లేడని రిషి నమ్ముతున్నాడని....ఇప్పుడు వాడే నీ మెడలో తాళికట్టాడని చెబితే నిన్ను ఖచ్చితంగా  పెళ్లి చేసుకోడని హెచ్చరిస్తుంది. వాడి దగ్గరకే పంపించడానికి ట్రై చేస్తాడని చెబుతుంది. ఇప్పటికే దేవా విషయంలో నరకం అనుభవిస్తున్నాని...ఇప్పుడు రిషి దగ్గర ఆవిషయం దాచి మళ్లీ ఈ నరకాన్ని జీవితాంతం మోయలేనని అంటాడు. ఈ నిశ్చయ తాంబూలాల తంతు ముగిసిన తర్వాత టైం చూసి చెప్పొచ్చులేనని మిధున చెల్లి వారిస్తుంది.                    

ముహూర్త సమయం దగ్గరపడుతున్నా రిషి తల్లిదండ్రులు రాకపోవడంతో  అతని తరఫున నిశ్చయ తాంబూలాలు తీసుకునే వారు ఎవరూ ఉండరు. ఇంతలో పూజ చేసిన పూజారి గారు మిధున, రిషిని  గుడి చుట్టూ ప్రదక్షణలు చేయమని చెప్పి పంపిస్తాడు. అప్పుడు అక్కడ దేవా, భానును చూసి రిషి షాక్‌కు గురవ్వడంతో  ఈరోజు ఏపిసోడ్‌ ముగిసిపోతుంది