Telangana phone tapping case:   జూన్ 2024లో తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సాధారణ పోలీస్ విచారణగా సాగుతున్న ఈ కేసును మరింత లోతుగా, పారదర్శకంగా విచారించేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి  వీసీ సజ్జనార్ నేతృత్వంలో  ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ కేసును హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, దర్యాప్తులో వేగం తగ్గడం, కీలక సూత్రధారులను పట్టుకోవడంలో జాప్యం జరగడంపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కేవలం కొంతమంది అధికారుల అరెస్టుతోనే ప్రక్రియ ఆగిపోయిందని, అసలైన రాజకీయ కోణాన్ని వెలికితీయడంలో ఇప్పటివరకు జరిగిన విచారణ సరిపోలేదని భావించిన సర్కార్, ఈ బాధ్యతను సజ్జనార్‌కు అప్పగించింది. 

Continues below advertisement

తాజాగా నియమితులైన సిట్  ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దీని వెనుక ఉన్న రాజకీయ పెద్దలెవరు? అనే కోణంలో సిట్ విచారణ జరుపుతుందని భావిస్తున్నారు.  నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల సహాయంతో ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్న పరికరాలను ఎలా వాడారు? అనేది నిగ్గు తేల్చనుంది.  ఎస్ఐబీ (SIB) కార్యాలయంలో సాక్ష్యాలను మాయం చేసేందుకు ధ్వంసం చేసిన కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌ల నుంచి డేటాను రీట్రీవ్ చేయడంపై దృష్టి పెట్టనుంది. హవాలా మార్గాల్లో నగదు రవాణాకు మరియు ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల ఫోన్లను ట్రాక్ చేయడానికి ఈ వ్యవస్థను ఎలా ఉపయోగించుకున్నారో సిట్ ఆధారాలు సేకరిస్తుంది.  వివాదాస్పద, క్లిష్టమైన కేసులను ఛేదించడంలో సీనియర్ అధికారి వీసీ సజ్జనార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. టెక్నాలజీపై అవగాహన ఉండటంతో పాటు, కఠినమైన అధికారిగా ఆయనకున్న ఇమేజ్ ఈ కేసులో బాధితులకు నమ్మకాన్ని కలిగిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆయనకు సహకరించేందుకు మరికొందరు దక్షత కలిగిన అధికారులను కూడా ఈ బృందంలో చేర్చారు. నిందితులను అరెస్టు  చేసి చాలా రోజులు జైల్లో పెట్టారు. ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించి ప్రశ్నించారు. అయితే ఈ కేసులో ఆధారాలేమీ లభించడండ లేదని తెలుస్తోంది. అందుకే  సజ్జనార్ రంగంలోకి దింపారని భావిస్తున్నారు. సిట్ రంగంలోకి దిగిన తర్వాత ఈ కేసులో కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.  

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేశారని అప్పటి విపక్ష నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ సహా చాలా మంది ఆరోపణలు చేశారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక..  ఇంటలిజెన్స్ విభాగంలో అత్యంత సున్నితమైన డేటా కనిపించుకండా పోవడంతో విచారణ చేపట్టారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.   కానీ ఆధారాలు సేకరించడంలో పోలీసులు సక్సెస్ లేకపోవడంతో సిట్ కు కేసును అప్పగించాలని చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.                                      

Continues below advertisement