Harish Rao used his house as collateral for a poor student education loan : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఉదారతను చాటుకున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. పేద విద్యార్థుల చదువు కోసం రాజకీయ నాయకులు సాయం చేయడం చూస్తుంటాం, కానీ  ఒక విద్యార్థిని భవిష్యత్తు కోసం తన సొంత ఇంటినే బ్యాంకులో తాకట్టు పెట్టారు  హరీష్ రావు. 

Continues below advertisement

రాజకీయాల్లోనే కాదు, మానవత్వంలోనూ తనకు సాటి లేరని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి నిరూపించుకున్నారు. ఆపదలో ఉన్నామంటూ తన గడప తట్టిన ఒక సామాన్య టైలర్ కుటుంబానికి ఆయన కొండంత అండగా నిలిచారు. పీజీ వైద్య విద్య  చదవాలని కలలు కంటున్న ఆ యువతికి ఆర్థిక కష్టాలు అడ్డురాగా, ఆమె కల నెరవేర్చడానికి హరీశ్ రావు ఏకంగా తన సొంత ఇంటినే బ్యాంకులో హామీగా పెట్టి విద్యా రుణం ఇప్పించారు.  సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన ఓ టైలర్ కుమార్తె కష్టపడి చదివి మెడిసిన్ పూర్తి చేసింది. ఉన్నత చదువుల కోసం పీజీలో సీటు సంపాదించినప్పటికీ, భారీ ఫీజులు చెల్లించడం ఆ కుటుంబానికి భారంగా మారింది. చేతిలో చిల్లిగవ్వ లేక, బ్యాంకుల్లో లోన్ పుట్టక ఆ విద్యార్థిని చదువు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ కుటుంబం తమ ఎమ్మెల్యే హరీశ్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకుంది. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఎవరైనా సిఫార్సు లేఖలు ఇస్తారు, కానీ హరీశ్ రావు  ఆ యువతి ప్రతిభను గుర్తించి, ఎలాగైనా ఆమెను ఉన్నత విద్యావంతురాలిని చేయాలని నిర్ణయించుకున్నారు. విద్యా రుణం రావడానికి సెక్యూరిటీ సమస్యగా మారడంతో, ఏమాత్రం సంకోచించకుండా  తన సొంత ఇంటి డాక్యుమెంట్లను బ్యాంకులో హామీగా  పెట్టారు.** తద్వారా సుమారు రూ. 20 లక్షల రుణం ఆ విద్యార్థినికి అందేలా చేశారు.        

 కేవలం లోన్ ఇప్పించడమే కాకుండా, తక్షణ అవసరాల కోసం తన వ్యక్తిగత ఖాతా నుంచి  రూ. 1 లక్ష నగదును  కూడా ఆ కుటుంబానికి అందజేశారు.   బాగా చదువుకుని సమాజానికి సేవ చేయాలాని ఆ విద్యార్థినికి భరోసా ఇచ్చారు. ప్రజాప్రతినిధి అంటే కేవలం ఓట్లు వేయించుకోవడం మాత్రమే కాదు, ప్రజల కష్టాల్లో భాగస్వామి కావాలని ఆయన నిరూపించారు. తన నియోజకవర్గ ప్రజలను సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నారు హరీష్ రావు.  ఒక సామాన్య టైలర్ బిడ్డ డాక్టర్ కావాలనే ఆశయానికి తన ఇంటినే తాకట్టు పెట్టిన హరీశ్ రావు  నియోజకవర్గ ప్రజల దృష్టిలో మరింతగా ఇమేజ్ పెంచుకున్నారు.