Sharmila Delhi :  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్నారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో పార్టీలో విలీనంపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. రెండు సార్లు తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు , విలీన వ్యవహారాలను చూస్తున్న  డీకే శివకుమార్ తో సమావేశం కూడా అయ్యారు. అయితే షర్మిల పార్టీ విలీనం చేసినా తెలంగాణలోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం ఆమెను ఏపీలో రాజకీయాలు చేయాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ తాను ఏపీలో రాజకీయాలు చేసే ప్రశ్నే లేదని పూర్తి స్థాయిలో తెలంగాణకే పరిమితం అవుతానని అంటున్నారు. 


ఏపీలోనూ రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఒత్తిడి                        


ఈ అంశంపైనే ప్రస్తుతం ప్రతిష్ఠంభన ఏర్పడిందని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనంపై అభ్యంతరాలు లేకపోయినప్పటికీ.. షర్మిలకు  తెలంగాణలో సీటు కేటాయించడంపై తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం సమర్థిస్తున్నట్లుగా చెబుతున్నారు. తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే ప్రకటించారు. అక్కడ ఇల్లు కూడా నిర్మించుకుంటున్నారు. షర్మిలకు  పాలేరులో సీటు కేటాయించి.. పార్టీని విలీనం చేసుకోవాలన్న ప్రతిపాదనలు ఎక్కువగా వస్తున్నాయి. 


తెలంగాణ రాజకీయాలేక పరిమితమవుతానంటున్న షర్మిల                           


అయితే వైఎస్ జగన్ వల్ల తమ పార్టీకి ఏపీలో తీవ్ర నష్టం ఏర్పడింది కాబట్టి.. వైఎస్ షర్మిలతో ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ లో విలీన వార్తను షర్మిల తన ప్రకటనలో ఖండించలేదు. కేవలం తాను ఏపీలో రాజకీయాలు చేస్తారని జరుగుతున్న ప్రచారాన్నే పరోక్షంగా ఖండించారు. తాను తెలంగాణలోనే ఉంటానంటున్నారు. వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఆమె రాజకీయాలు చేయాల్సి వస్తే విలీనం అవసరం లేదని రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ గా వెళ్లాలంటున్నారు. రేవంత్‌తో పాటు ఎక్కువ మంది ఆమె ఎపీ కాంగ్రెస్ లో అయితే ఉపయోగం అని విశ్లేషిస్తున్నారు. కానీ షర్మిల మాత్రం తెలంగాణలోనే రాజకీయం చేస్తానంటున్నారు.   


ఢిల్లీ పర్యటనలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం                                         


షర్మిల ఏపీలో రాజకీయం చేయడానికి అంగీకరిస్తే వెంటనే విలీనం చేయడానికి హైకమాండ్ వెంటనే అంగీకరించే చాన్స్ ఉంది. కానీ ఏపీలో మాత్రం తన సేవలు ఉపయోగించుకోడానికి లేదని.. కేవలం తెలంగాణకు మాత్రమే అంటే.. హైకమాండ్ ఆలోచించే అవకాశం ఉందని అంటున్నరాు.  ఢిల్లీ పర్యటనలో షర్మిల ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 







Join Us on Telegram: https://t.me/abpdesamofficial