Sharmila Padayatra : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర 3700 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. జనగామ నియోజకవర్గం  తరిగొప్పుల మండల కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి  షర్మిల మాట్లాడారు.  3700 కిలోమీటర్లు నడిచింది నేనే అయినా..నడిపించింది మీ అభిమానమేనని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్  మరణించి 13 ఏళ్లు అయింది అయినా ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని..  వైఎస్సార్ కి మరణం లేదని మీ అభిమానం చూస్తుంటే అర్థం అవుతుందని ఆమె  సంతోషం వ్యక్తం చేశారు.                      


ఇప్పుడున్నాడు మన ముఖ్యమంత్రి కేసీఅర్  సీఎం కాదు..మోసగాడని..  ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.   మూడు ఎకరాల భూమి అని మోసం,పోడు పట్టాలు అని మోసం,రైతులకు ఉచిత కరెంట్,ఉచిత ఎరువులు అని మోసం,రుణమాఫీ అని మోసం చేశారన్నారు.  చరిత్రలో సచివాలయం కి రాని ముఖ్యమంత్రి మన కేసీఅర్ ..తెలంగాణలో సాగేది ఫామ్ హౌజ్ పాలన అని మండిపడ్డారు.   ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు అని పట్టింపు లేదు.రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టింపు లేదు. దొర 8 ఏళ్ల పాలనలో 8 వేల మంది ఆత్మహత్యలు పండించిన పంటకు గిట్టుబాటు ఉండదు.వరి వేస్తే ఉరి అని చెప్పిన సన్నాసి ముఖ్యమంత్రి కేసీఅర్ అని ఘాటు విమర్శలు చేశారు.                      


కళ్లముందే రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి... 8 ఏళ్లలో భర్తీ చేసింది 65 వేలు మాత్రమేనన్నారు.  ఇప్పుడు 50 వేల ఉద్యోగాలను నోటిఫికేషన్ వేశాడు.అవి ఎప్పుడు భర్తీ అవుతాయో తెలియదన్నారు.  ఉద్యమంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడితే రాయొద్దు అని చెప్పారు.స్వరాష్ట్రంలో ఎన్ని గ్రూప్ 1 నోటిఫికేషన్ లు ఇచ్చారుని ఆమె ప్రశ్నించారు.   కెసిఆర్ ఇంట్లో 5 ఉద్యోగాలుప్రజల బిడ్డలు మాత్రం ఉద్యోగాలు లేక అత్మహత్యలు బంగారు తెలంగాణ కేసీఅర్ కుటుంభానికి అయ్యింది.. ఒకప్పుడు డొక్కు స్కూటర్ లో తిరిగే వాడు.ఇప్పుడు విమానాలు కొనే స్థాయికి ఎదిగారు.TRS పార్టీ నీ కాస్త బీఆర్ ఎస్ చేశాడని మండిపడ్డారు. 


ఈ దరిద్రం ఇక్కడితో చాలదు అన్నట్లు దేశం మీద పడ్డాడు.ఈ ఏడాది ఎన్నికలు ఉన్నాయి. కేసీఅర్ మళ్ళీ వస్తాడు.  పిట్ట కథలు చెప్తాడు.  ఓట్ల కోసం చందమామ తీసుకు వస్తా అంటాడని మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.   తాను  వైఎస్సార్ బిడ్డనని పులి కడుపున  పులే పుడుతుందన్నారు. YSR సంక్షేమ పాలన అందిస్తానని..  YSR ప్రతి పథకానికి పునర్ వైభవం తీసుకు వస్తామని హామీ ఇచ్చారు.  ,వ్యవసాయాన్ని పండుగ చేస్తా,వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం,ఇల్లు లేని కుటుంభానికి మహిళ పేరు మీద పక్కా ఇల్లు,ఇంట్లో ఎంత మంది అర్హులు ఉంటే అందరికీ 3 వేలు తక్కువ కాకుండా పెన్షన్ భారీగా ఉద్యోగాల కల్పన మీద తొలి సంతకం చేస్తానన్నారు.  అక్క,చెల్లెళ్ళకు మాట ఇస్తున్న బెల్ట్ షాపులు రద్దు చేస్తామని ప్రకటించారు.