Fire Accident in Mint Compound: హైదరాబాద్ (Hyderabad) లోని మింట్ కాంపౌండ్ (Mint Compound)లో గల ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పుస్తకాలు ముద్రించే యంత్రాలు, పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు.


Also Read: Viral News: మున్సిపల్ ఆఫీస్‌ గేట్‌కు కోడి కట్టి నిరసన- అధికారుల నిర్లక్ష్యంపై వెరైటీ ఆందోళన