Secunderabad Trains : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. నిరసనకారులను అదుపుచేసేందుకు పోలీసులు పన్నిన వ్యూహం ఫలించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పోలీసుల అదుపులోకి వచ్చింది. ఒక్కసారిగా నిరసనకారులను పోలీసులు చుట్టుముట్టారు. నిరసనకారులను ఒక్కొక్కరుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ప్రాథమిక విచారణలో 7 రైలు ఇంజిన్లు ధ్వంసమైనట్లు అధికారులు గుర్తించారు. సుమారు రూ.30 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్ లను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. ప్రయాణికులను రిజర్వేషన్లు రద్దు చేసుకోవద్దని కోరుతున్నారు.  రైళ్ల పునరుద్ధరణ చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. 


నిరసకారుల అరెస్టు 


అంతకు ముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నిరసనకారులను అరెస్టు చేస్తున్నారు. రాపిడ్ యాక్షన్ పోర్స్ రంగంలోకి దిగి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరిలిస్తున్నారు.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రాత్రి 7 తర్వాత రైళ్లు పునరుద్ధరణ చేశారు. ముందుగా ట్రాకుల నుంచి నిరసనకారులు వెనుదిరిగారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. దీంతో రైళ్ల పునరుద్ధరణకు చేశారు. అలాగే నగరంలో నడిచే మెట్రో రైళ్ల పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాయంత్రం 6.35 నుంచి మెట్రో రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు. 



ఆల్ క్లియర్ 


సికింద్రాబాద్ లో ఆల్ క్లియర్ అయింది. రైళ్లు నడిపేందుకు అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇవాళ్టి ఘటనలో రైల్వే సిబ్బంది ఎవరూ గాయపడలేదని రైల్వే డీఆర్ఎం తెలిపారు. రైల్వే స్టేషన్ లో స్టాళ్లు, ఎస్కలేటర్లు ధ్వంసం అయ్యాయని తెలిపారు.  తొమ్మిది గంటల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. 


రైళ్ల సమాచారం


1. 17.06.2022న సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు నంబర్ 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ రద్దు అయింది. 


2. రైలు నం. 12728 హైదరాబాద్-విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ 17.06.2022న హైదరాబాద్‌లో బయలుదేరుతుంది


3. 18.06.2022న విశాఖపట్నం నుండి బయలుదేరే రైలు నం. 12727 విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్ రద్దు చేసింది.


4. రైలు నెం. 08036 సికింద్రాబాద్-షాలిమార్ RRB స్పెషల్ ఎక్స్‌ప్రెస్ 17.06.2022న సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది.