Breaking News Live: మెలిటోపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా బలగాలు
Breaking News Live: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
Russia Ukraine War: ఉక్రెయిన్‌లో కొనసాగనున్న పెద్ద యుద్ధం కోసం ప్రపంచం సిద్ధంగా ఉండాలని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ఇంతటితో ఆగదు. సంక్షోభం కొంతకాలం పాటు కొనసాగుతుందని ఏఎఫ్‌పీ రిపోర్ట్ చేసింది. ఈ యుద్ధం వల్ల తలెత్తే పరిణామాలను చాలా కాలం ఎదుర్కోవాల్సి వస్తుందని మాక్రాన్ అభిప్రాయపడ్డారు. ఐరోపాలో తాజాగా జరుగుతున్న యుద్ధానికి కారణం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అని పేర్కొన్నారు.
Russia Ukraine Conflict: ఉక్రెయిన్‌పై మూడో రోజు సైతం దాడులు కొనసాగిస్తున్న రష్యా మెలిటోపోల్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని ప్రకటించింది. చర్చలకు ఉక్రెయిన్‌ను ఆహ్వానిస్తూనే తమ షరతులకు అంగీకరించాలని ఆంక్షలు విధిస్తోంది. దక్షిణ ప్రాంతం జపోరిజ్‌యాలో ఉన్న మెలిటోపోల్ సిటీని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది.
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రారంభం
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు చర్యలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ముంబయి నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం బుచారెస్ట్‌కు చేరుకుంది. అక్కడి నుంచి పౌరులను ఎయిరిండియా విమానంలో స్వదేశానికి తరలించనున్నారు. భారతీయులు రోడ్డుమార్గంలో ఉక్రెయిన్, రొమేనియా సరిహద్దులకు చేరుకున్నారు.
KU Students Protest: హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు చదువుతున్న విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని వైస్ ఛాన్సలర్ చెప్పడంతో విద్యార్థులు రోడ్డెక్కారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట బైఠాయించారు. కొందరు భవనం పైకి ఎక్కి మరీ నిరసన తెలిపారు. వైస్ చాన్సలర్ కు వ్యతిరేకంగా నినాదాలతో విద్యార్థుల ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.
మహబూబాబాద్ జిల్లా: బయ్యారం మండల కేంద్రంలో దారుణం జరిగింది. తెల్లవారుజామున ఓ ఆశా వర్కర్ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును వదిలివేళ్లారు. శిశువు అరుపులు, కేకలతో ఆశా వర్కర్ మేల్కొని ఇది గమనించారు. వెంటనే సమీపంలో వున్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాని శిశువును తరలించారు. చిన్నారి ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.
నల్గొండ జిల్లాలో విషాదం జరిగింది. పెదవూర మం. తుంగతుర్తి సమీపంలో ఓ ట్రైనింగ్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్, ట్రెయినీ పైలట్ ఇద్దరు మృతిచెందినట్లు తెలుస్తోంది.
Ukraine Russia Conflict: ఉక్రెయిన్‌లోని భారతీయులకు పలు సూచనలు చేశారు. అధికారులతో సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లవద్దని కీవ్‌లోని రాయబార కార్యాలయం సూచించింది. సరిహద్దుల వద్ద పరిస్థితి అంతగా బాగోలేదని, భారతీయులు జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది పడతారని చెప్పారు. ఎంబసీలతో కలిపి పనిచేస్తూ పౌరులకు వారి దేశాలకు పంపే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు.
Background
ఏపీలో నైరుతి, దక్షిణ దిశల నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఏపీలో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి గాలులు వీస్తాయి. వర్షాలు లేకపోవడంతో రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రలు భారీగా పెరుగుతున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వాతావరణం పొడిగా ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల 36 డిగ్రీలు నమోదు కానున్నాయి. వేటకు వెళ్లడానికి మత్స్యకారులకు ఏ ఇబ్బంది లేదు. అత్యల్పంగా జంగమేశ్వరపురం, బాపట్ల, నందిగామ, కళింగపట్నం, అమరావతి, విశాఖపట్నంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే వాతావరణం పొడిగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో మాత్రం 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా ఆదిలాబాద్ ఏజెన్సీలో 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఇతర జిల్లాల్లో కనీసం 20 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వారం రోజులు పెరిగిన బంగారం ధర నేడు దిగొచ్చింది. మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలో పయనిస్తూ భారీగా క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర రూ.550 మేర తగ్గడంతో తాజాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,300 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.50,510 అయింది. స్వచ్ఛమైన వెండి ధర రూ.1,200 మేర భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.68,600 కు ఎగబాకింది.
ఏపీ మార్కెట్లో బంగారం ధరలు నేడు తగ్గాయి. విజయవాడలో రూ.510 మేర బంగారం ధర (Gold Rate in Vijayawada 15th February 2022) తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,500 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300కి పతనమైంది. విజయవాడలో వెండి 1 కేజీ ధర రూ.68,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం, వెండి ఇదే ధరలో ట్రేడింగ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,510 అయింది.
హైదరాబాద్‌లో ఇంధన ధరలు యథాతథంగా ఉన్నాయి. పెట్రోల్ ధర లీటరు(Petrol Price in Hyderabad (26th February 2022)కు రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనూ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉన్నాయి.
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర పెరిగింది. 19 పైసలు పెరగడంతో ఇక్కడ పెట్రోల్ లీటర్ ధర రూ.107.96 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.94.39 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో 19 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.107.88 అయింది. 18 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.94.31 కి దిగొచ్చింది. కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) పెరిగాయి. 18 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.108.57 కు చేరింది. 16 పైసలు పెరగడంతో డీజిల్ ధర రూ.94.95 అయింది.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలో ఎంతో మంది సైనికులతో పాటు ఆ దేశ పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతోన్న వేళ పలు దేశాల నుంచి వస్తున్న అభ్యర్థనలపై స్పందించిన రష్యా ప్రభుత్వం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ ఆర్మీ లొంగిపోతే, తాము చర్చలకు సిద్ధమని రష్యా విదేశాంగ మంత్రి తెలిపారు.
తమ దేశాన్ని రష్యా ఆక్రమిస్తుందని ఉక్రెయిన్ పౌరులు ఆందోళన చెందుతున్నారు. కొందరు తమ వాహనాలలో ఎలాగైనా సరే దేశం నుంచి బయట పడాలని యత్నిస్తున్నారు. శుక్రవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా దాడులు మొదలుపెట్టింది. కీవ్ నగరంలో రష్యా యుద్ధ ట్యాంకు కారు మీదకు దూసుకొచ్చినా ఓ వ్యక్తి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -