Rohith Vemula Mother Meet Cm Revanth Reddy: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) విద్యార్థి రోహిత్ వేముల (Vemula Rohit) తల్లి రాధిక సీఎం రేవంత్ రెడ్డిని (Cm Revanth Reddy) కలిశారు. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అతను దళితుడే కాదని పోలీసులు రిపోర్ట్ ఇచ్చినట్లు ప్రచారం సాగడంతో HCUలో తాజాగా ఆందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇది హాట్ టాపిక్ గా మారింది. వేముల రోహిత్ 2016లో వర్సిటీ క్యాంపస్ లో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అప్పట్లో హెచ్ సీయూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు అప్పట్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు సైతం స్పందించాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండుసార్లు హైదరాబాద్ వచ్చారు. రోహిత్ ఆత్మహత్యపై అప్పట్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
కీలక మలుపు
వేముల రోహిత్ ఆత్మహత్య కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. గచ్చిబౌలి పోలీసులు రోహిత్ ది ఆత్మహత్యగా తేల్చారని, ఎలాంటి సాక్ష్యాలు సేకరించలేకపోయారని, కేసు మూసివేసినట్లు శుక్రవారం ప్రచారం జరిగింది. పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు, ఎవిడెన్స్ ఏమి లేవని కోర్టుకు నివేదిక ఇచ్చారు పోలీసులు. రోహిత్ వేముల దళితుడే కాదని సైతం క్లోజింగ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్లు వైరల్ అయింది. అయితే ఈ కేసుపై రోహిత్ తల్లి అనుమానాలు వ్యక్తం చేయడం, హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనతో తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోహిత్ వేముల కేసును పునర్విచారణ చేయాలని డీజీపీ రవిగుప్తా నిర్ణయం తీసుకున్నారు. దర్యాప్తును కొనసాగించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ కేసు పునః విచారణకు అనుమతి కోరుతూ తెలంగాణ పోలీస్ శాఖ కోర్టులో పిటిషన్ వేయనుంది.
Also Read: Mynampally Hanmantha Rao : సిద్దిపేటలో రాజీనామా చేస్తే నేనే పోటీ చేస్తా - హరీష్‌కు మైనంపల్లి సవాల్