BC Reservations Revanth reddy: బీసీలు తనకు రక్షణగా రావాలని ముఖ్యమంత్రి రేవంత్ పిలుపునిచ్చారు. ముందుకు తీసుకెళ్లాల్సింది మీరేనని  లేకుంటే బీసీ రిజర్వేషన్ రాదన్నారు.  పకడ్బందీగా కుల గణన నిర్వహించాం...సర్వే పూర్తయ్యాక ఇంటి యజమాని సంతకం తీసుకున్నాం.. కుల గణనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.  ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 

పకడ్బందీగా కులగణన

రాష్ట్రంలో దాదాపు 25 రోజులు పాటు రాహుల్‌గాంధీ తెలంగాణలో పాదయాత్ర చేశారని..  ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారని రేవంత్ గుర్తు చేశారు. రాహుల్‌ గాంధీ మాట ఇచ్చిన తర్వాత ప్రజలు మనకు అధికారం ఇచ్చారని..  అధికారిక కార్యాచరణకు అధికార బృందాన్ని వేశామన్నారు.  కులగణనలో మూడు రోజులు ఇండ్ల వివరాలు సేకరించామని..  ప్రభుత్వంలోని 15 శాఖలకు చెందిన అధికారులను నియమించామన్నరాు.  మొత్తం 8పేజీలో ఇంటి యజమాని ఇచ్చిన సమాచారాన్ని సేకరించాం. 36 వేల మంది డేటా ఆపరేటర్లను అదనంగా నియమించామని తెలిపారు. ఎన్‌రోలర్‌గా సమాచారం సేకరించిన వారే డేటా ఎంట్రీ చేశారు. దాదాపు కోటి 12 లక్షలకు పైగా కుటుంబాలు కులగణనలో పాల్గొన్నాయి.

కులగణనతో సాహసోపేమైన నిర్ణయం

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కులగణన ప్రయత్నమే చేయలేదని రేవంత్ తెలిపారు.  కులగణనను న్యాయపరంగా, చట్టపరంగా చేశామన్నారు. 96.9 శాతం జరిగింది 3.1 శాతం కులగణన సర్వే రాలేదని.. ఇంత పారదర్శకంగా కులగణన చేపడుతున్నా కొంతమంది నాయకులు ఇంకా చేయించుకోలేదన్నారు. కేసీఆర్‌ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో 4 కేటగిరీలుగానే జనాభా శాతాన్ని చెప్పారని..  కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో 5 కేటగిరీలు ఉన్నాయన్నారు. ముస్లింలలో ఓబీసీలను నాడు కేసీఆర్‌ ప్రభుత్వం విడిగా చెప్పలేదని గుర్తు చేశారు. గుజరాత్‌లో కూడా ఓబీసీ ముస్లింలు ఉన్నారని ప్రధాని మోదీ చెప్పారని.. బీసీల లెక్క తేలితే మాకేంటి.. అని ఆ వర్గం అడుగుతారని బీజేపీ, బీఆర్‌ఎస్‌ భయపడుతోందన్నారు. చారిత్రాత్మకమైన, సాహసోపేతమైన నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది.. భవిష్యత్‌లో కులగణన విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.       

కులగణనలో తప్పు ఎక్కడ ఉందో చూపించాలి                             

కులగణన తప్పు అయితే ఎక్కడ తప్పు ఉందో చూపించండి అని బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కులగణన సర్వే రాహుల్ గాంధీ మనకు ఇచ్చిన ఆస్తి. దానిని మీరు కాపాడుకోకపోతే మీకే నష్టం అని క్లాస్ తీసుకున్నారు. కట్టే పట్టుకొని కాపాడుకోండి. అంతా రేవంత్ రెడ్డే చూసుకుంటాడు. దేశంలో ఏ సీఎం చేయని సాహసం చేస్తున్నానని తెలిపారు.  అంటే .. ఇప్పటికైతే ఇక రిజర్వేషన్లు ఉండవు కానీ.. తనకు మద్దతుగా ఉంటే.. రిజర్వేషన్లు తీసుకు వస్తానని రేవంత్ భరోసా ఇచ్చిటనట్లయింది.   

Also Read: రేవంత్ రెడ్డి జుట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉంది - ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు