Revanth said that Modi is spreading lies about the Telangana government: ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని ా పార్టీని నమ్మవద్దని మహారాష్టర్, జార్ఖండ్‌లో జుగుతున్న ఎన్నికల్లో ప్రచారసభల్లో మోదీ ఆరోపిస్తున్నారు. ఇలా తెలంగాణ విషయంలో మోదీ చేస్తున్న ఆరోపణలకు రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు.  మా ప్రభుత్వం గురించి మోడీ చేసిన ప్రకటనలో అనేక అపోహలు, అవాస్తవాలు ఉన్నాయని ట్వీట్టర్‌లో తెలిపారు. 


డిసెంబర్ 7వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ేర్పడినప్పుడు  బీఆర్ఎస్‌ దుష్పరిపాలన  పోయిందని ప్రజల ఆనందం, ఆశలు వెల్లువెత్తాయన్నారు. అధికారం చేపట్టిన  2 రోజుల్లోనే 2 వాగ్ధానాలు నెరవేర్చాం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని గుర్తు చేశారు.  రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల ఆరోగ్య సంరక్షణ విడుదల చేశామన్నారు. పదకొండు నెలల్లో తెలంగాణ అమ్మలు, సోదరీమణులు 101 కోట్ల ఉచిత బస్సు ప్రయాణ ట్రిప్స్ వినియోగించుకున్నారని దీని వల్ల మహిళలు రూ.3,433 కోట్ల రూపాయలను మిగుల్చుకున్నారని తెలిపారు.       


ఏడాది కాక ముందే దేశంలోనే అత్యంత పెద్దది అయిన రుణమాఫీని అమలు చేశామని  22 లక్షల 22 వేల మంది రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీని అమలు చేశామని స్పష్టం  చేశారు.ఈ కారణంగా తెలంగాణ రైతులు రాజులుగా బతుకుతున్నారని తెలిపారు. ఇరవై ఐదు రోజుల వ్యవధిలోనే పద్దెనిమిది వేల కోట్ల రూపాయల్ని బ్యాంకుల ఖాతాల్లో జమ చేశామన్నారు. మహిళలు తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారని దీనికి కారణం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడమేనని తెలిపారు. ఏ బీజేపీ ప్రభుత్వం కూడా ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రూ. ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మహిళలకు ఇస్తున్నామని స్పష్టం చేశారు. 1.31 కోట్ల గ్యాస్ సిలిండర్లను ఇప్పటికే రూ. ఐదు వందలకు పంపిణీ చేశామన్నారు. 



పదకొండు నెలల్లోనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేసి యువత ఆశల్ని నెరవేస్తున్నామని.. ఏ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా తమ సాటి రాదన్నారు. మూసి నదిని ప్రక్షాళన చేస్తున్నామని పదేళ్ల పాటు నిర్లక్ష్యం చేసిన దాన్ని సరి చేస్తున్నామన్నారు. భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని దీని కోసం మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోందన్నారు. విద్యారంగంలో స్కిల్ యూనివర్శిటీ, స్పోర్ట్స్ యూనివర్శిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. పదకొండు నెలల కాలంలో గత బీఆర్ఎస్ పాలనలో అలుమకున్న చీకట్లను పాలదోలుతున్నామని తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి చెందుతోందన్నారు