Revanth Reddy Chit Chat : మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ జరిపిస్తాం. విచారణ తర్వాతే చర్యలుంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. త ప్రభుత్వం మాదిరి తాము అబద్ధాల బడ్జెట్ ప్రవేశపెట్టలేదని, వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వనికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయం చేయని భూములకు కూడా రైతుబంధు వెళ్తుందన్నారు.
రూల్స్ ప్రకారమే బీఏసీ
బీఏసీకి హారీష్ రావును అనుమతించని అంశంపై రేవంత్ రెడ్డి స్పందించారు. బిఏసీ కి హాజరయ్యే పేర్లను బీఆర్ఎస్సే ఇచ్చిందని.. అందులో ఎవరి పెరు ఉంటే వారిని పిలుస్తారన్నారు. హరీష్ రావు అర్ధం పార్ధం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో బీఏసీ లో ఎలాంటి నిర్ణయాలు ఉన్నాయో అవి అమలు అవుతున్నాయన్నారు. తన భాషపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శల్ని రేవంత్ తిప్పి కొట్టారు. తెలంగాణ భాషనే మాట్లాడుతున్నానన్నారు. అబద్దాల ప్రాతిపదికన బడ్జెట్ పెట్ట దలచుకోలేదు.. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ పెట్టాం. అబద్ధాలు చెపితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సంవత్సరం అంతా అబద్ధాలు చెప్పాలన్నారు. మిత్తి కట్టలేకనే రైతులు అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కమీషన్ల కోసం టెండర్లు పిలిస్తే గత ప్రభుత్వం లాగే అవుతుందన్నారు. రుణమాఫీచేస్తామని.. స్పష్టం చేశారు.
విచారణ తర్వాత చర్యలు
ఏ పార్టీ ఎమ్మెల్యే లను అయిన కలుపుకుని పోతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇరిగేషన్ పై వాస్తవాలు చెప్పబోమని.. సభలో శ్వేతా పత్రం ఇరిగేషన్ మంత్రి విడుదల చేస్తారని ప్రకటించారు. అమరవీరుల స్థూపం, అంబేడ్కర్ విగ్రహం, సచివాలయం నిర్మాణాలపై విచారణ జరిపిస్తాం. విజిలెన్స్ విచారణ జరిపాం. జ్యుడిషియల్ విచారణలో అసలు విషయాలు తెలుస్తాయన్నారు. మేడిగడ్డకు వెళ్దామని సభ్యులందరినీ ఆహ్వానించామని.. 13న బీఆర్ఎస్ వాళ్ళకి మీటింగ్ ఉంటే ఒకరోజు ముందు వెనక వెళదాం అన్నా మేం రెడీ అని ప్రకటించారు. పదేండ్లు అయినా కేసీఆర్ కి బడ్జెట్ అంచనా వేయడం రాలేదు. వాస్తవాలకి అనుగుణంగా బడ్జెట్ ప్రిపేర్ చేసినందుకు భట్టి కి అభినందనలు తెలిపారు.
ఎమ్మెల్యేల చేరికలపై జగ్గారెడ్డి ఇంకాచెప్పలేదు!
ఇరవై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరుతారని జగ్గారెడ్డి చే సినవ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. బిఅరెస్ ఎమ్మెల్యే ల చేరిక పై జగ్గారెడ్డి మాకు చెప్పలేదన్నారు. చెబితే అధిష్టానం తో మాట్లాడుతామన్నారు. ఎవరైనా సీఎంను కలవవచొచ్చని.. వారిపై వాళ్ల పార్టీలో అనుమానం ఉంటే తాను ఏమీ చేయలేనన్నారు.