SJ Suryah joins the cast of Vikram’s Chiyaan 62: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో ‘చియాన్ 62’ అనే చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాను ‘చిత్తా’ దర్శకుడు ఎస్ యు అరుణ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. తాజాగా ఈ చిత్రబృందం మరో కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మరో విలక్షణ నటుడు భాగం కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేసింది.


‘చియాన్ 62’ చిత్రంలో ఎస్ జే సూర్య


‘చియాన్ 62’లో నటించబోయే నటుడు మరెవరో కాదు ఎస్ జే సూర్య. కోలీవుడ్ పాటు తెలుగు, తమిళంలో వరుస సినిమాలో ఫుల్ బిజీ అయ్యారు. గ‌తేడాది ‘మార్క్‌ ఆంటోని’, ‘జిగర్‌తండ డబుల్‌ ఎక్స్‌’ లాంటి సినిమాల‌తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ప్ర‌స్తుతం అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టారు. ‘చియాన్ 62’ క్రేజీ ప్రాజెక్టులోనూ ఆయన భాగం అవుతున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో సూర్య మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారని చిత్రబృందం వెల్లడించింది.






డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న విక్రమ్


ఇక అరుణ్ కుమార్ ఇప్పటికే 'పన్నయ్యరుమ్ పద్మినియుమ్', 'సేతుపతి', 'సింధుబాద్' సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ‘చిత్తా’ తెలుగులో ‘చిన్నా’ మంచి విజయాన్ని హిట్ సాధించింది. ఇప్పుడు చియాన్ విక్రమ్ తో అరుణ్ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో విక్రమ్ ఓ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘చియాన్ 62’ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శిబు థమీన్ కుమార్తె రియా శిబు ఈ చిత్రాన్ని హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.


‘సరిపోదా మంగళవారం’ చిత్రంలో నటిస్తున్న సూర్య


అటు తెలుగులో ఎస్ జే సూర్య..  నాని హీరోగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.  వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతున్నది. ఇప్పటికే నాని, వివేక్ కాంబోలో ‘అంటే సుందరానికి’ అనే సినిమా వచ్చింది. ఆ చిత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ, వివేక్ పనితీరుకు ఇంప్రెస్ అయిన నాని, మరో అవకాశం ఇచ్చారు. ‘సరిపోదా శనివారం’ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. 


Read Also: సితారనూ వదలని దుండగులు - పోలీసులను ఆశ్రయించిన నమ్రత శిరోద్కర్