Revant Reddy : వనదేవతల స్ఫూర్తిగా కేసీఆర్ పై పోరాటం - పాదయాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డి !

వన దేవతల స్ఫూర్తిగా కేసీఆర్ పై పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.

Continues below advertisement


Revant Reddy :    ప్రకృతి దేవతలు అయిన సమ్మక్క-సరక్క స్పూర్తితో పోరాటం చేస్తున్నామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.  నాడు తమ హక్కుల కోసం వనదేవతలు పోరాటం చేస్తే నేడు పేదల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.  భార‌త్ జోడో యాత్ర‌కి కొన‌సాగింపుగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాద‌యాత్ర‌ని ములుగు నుంచి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు.  9 ఏండ్లలో KCR ప్రభుత్వం 25 లక్షల కోట్ల బడ్జెడ్ పెడితే 119 నియోజకవర్గలలో ఎంత ఖర్చు చేశారు ఎంత దొంగల పరం అయిందో చెప్పాలని డిమాండ్ . కేసీఆర్  డబ్బులను నమ్ముకున్నాడని, తాము ప్రజలను నమ్ముకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.  ప్రజా ఆలోచనలకు అనుగులంగా కాంగ్రెస్ ఉంది,పార్టీ నేతలందరిని కలుపుకొని యాత్ర కొనసాగిస్తామన్నారు.  

Continues below advertisement

మేడారం వన దేవతల్ని దర్శించుకుని పాదయాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డి 
 
హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాద‌యాత్ర‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ములుగు నుంచి శ్రీకారం చుట్టారు .. పాదయాత్ర కోసం ఇంటి నుంచి బయలుదేరుతున్న రేవంత్ రెడ్డికి కూతురు నైమిష హారతి ఇచ్చారు. అనంత‌రం ఆయ‌న కాన్వ‌య్ తో ములుగు చేరుకున్నారు… గ‌జ‌మాల‌తో కార్య‌క‌ర్త‌లు రేవంత్ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అంతకు ముందు సమ్మక్క సారలమ్మ మేడారం వనదేవతల దర్శనానికి వెళ్తున్న రేవంత్ రెడ్డి జనగామ జిల్లా నెల్లుట్ల బ్రిడ్జి వద్ద 400 మంది కార్యకర్తలతో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని శాలువాతో సన్మానించారు .  హాత్ సే హాత్ అభియాన్ జోడయాత్ర కు తెలంగాణలో సంపూర్ణ మద్దతు లభిస్తుందని అన్నారు .ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉందని అన్నారు . 

రెండు నెలల పాటు కొనసాగనున్న పాదయాత్ర 

అనంత‌రం ఆయ‌న‌ మేడారం సమ్మక్క సారలమ్మ గద్దె వద్దకు రేవంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు..అక్క‌డ నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించారు.. పాద‌యాత్ర‌ కొత్తూరు, నార్లాపూర్‌ మీదుగా ప్రాజెక్ట్‌నగర్‌కు చేరుకుంది.  మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది రోజులపాటు సాగే యాత్రలో తాను పాల్గొంటున్నారు. జోడో యాత్ర.. ఈ నెల 22 వరకు కొనసాగుతుంది.  24 నుంచి మూడు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఏఐసీసీ ప్లీనరీ జరగనుంది. అందులో పాల్గొనడానికి  యాత్రకు విరామం ఇస్తారు. తర్వాత  మళ్లీ కొనసాగుతుంది.  మొత్తం రెండు నెలల పాటు ఈ యాత్రలు కొనసాగుతాయని కాంగ్రెస్ వర్గాలు  చెబుతున్నాయి. 

సీనియర్ నేతలు కూడా పాదయాత్ర ! 

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తదితర ముఖ్యనేతలు వేర్వేరు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఈ పాదయాత్రను చేస్తారు.  రాహుల్‌ గాంధీ సందేశాన్ని రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చేర్చేందుకే ఏఐసీసీ ఈ కార్యక్రమాన్ని నిర్దేశించిందని, పార్టీ నాయకులంతా దీన్ని సమన్వయంతో అమలు పరచాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ థాక్రే పిలుపునిచ్చారు.  పాదయాత్ర విషయంలో సీనియర్ నేతలకూ థాక్రే స్వేచ్చ ఇచ్చారు.  యాభై, అరవై నియోజకవర్గాల్లో రేవంత్ పాదయాత్ర చేస్తారు. మిగిలిన నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు చేస్తారు. 

Continues below advertisement
Sponsored Links by Taboola