CM Revanth issues warning to Private colleges: ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయలేదని సమ్మె చేస్తున్న కాలేజీల యాజమాన్యాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్అయ్యారు. మీడియాతో మాట్లాడిన ఆయన యాజమాన్యాల సంగతి చూస్తామని హెచ్చరించారు.  తెలంగాణలో ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీల స్ట్రైక్  నాలుగు రోజులుగా సాగుతోంది. రీఇంబర్స్‌మెంట్  డ్యూస్  రూ. 10,000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 3 నుంచి అన్ని కాలేజీలు మూసివేశారు.              

Continues below advertisement

ఫీజుల బకాయిలు ఇవ్వలేదని ప్రైవేటు కాలేజీల బంద్              

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రైవేట్ కాలేజీ మేనేజ్‌మెంట్లకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. "విద్యార్థుల జీవితాలతో ఆటలాడకండి.. తమాషాలు చేస్తే తాటా తీస్తాం.. రాజకీయ పార్టీలతో అంటకాగుతూ బ్లాక్‌మెయిల్ చేస్తే ప్రభుత్వం సహించదు" అని సీఎం స్పష్టం చేశారు. కాలేజీలలో సౌకర్యాలు ఉన్నాయో లేవో తనిఖీలు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు.  రేవంత్ రెడ్డి వచ్చాకనే కొత్తగా సమస్యలు వచ్చినట్టు మాట్లాడకండి.. ముందు ప్రభుత్వాల్లో ఈ సమస్య లేదని చెప్పడం తప్పు. మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నారో తెలుసని రేవంత్రెచ్చరించారు.           

Continues below advertisement

బీఆర్ఎస్ కుట్రలో భాగమయ్యారని రేవంత్ అనుమానం - ఎలా డొనేషన్లు వసూలు చేస్తారో చూస్తానని హెచ్చరిక           

అడిగినవి ఇవ్వకపోతే కాలేజీలు మూసేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. బ్లాక్‌మెయిల్ చేస్తే ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.  ప్రభుత్వం విడతలవారీగా  రీఎంబంర్స్ మెంట్  నిధులు విడుదల చేస్తామని, కానీ స్ట్రైక్‌లు, రాజకీయ ఒత్తిడి చేస్తే తాట తీస్తామని స్పష్టం చేశారు. "కాలేజీలైనా, రాజకీయ పార్టీలైనా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే ఉపేక్షించేది లేదు" అని కూడా చెప్పారు. వచ్చే ఏడాది నుంచి డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో.. ఫీజులు ఎలా అడుగుతారో చూస్తామని సీఎం హెచ్చరికలుజారీచేశారు.  కొన్ని మేనేజ్‌మెంట్లు 'అన్‌అకౌంటెడ్ ఫీ ' వసూలు చేస్తున్నాయని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది కాలేజీ యాజమాన్యాల పేర్లు చెప్పిన సీఎం రేవంత్.. వారి క్యాంపస్‌ల గురించి ప్రశ్నించారు.                

రేవంత్ కఠిన వైఖరితో కాలేజీల యాజమాన్యాలు దిగి వస్తాయా?         

తెలంగాణలో   FATHI - ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ కు  SC, ST, BC, మైనారిటీల పేద విద్యార్థులకు ఫీ  రీఇంబర్స్ ప్రభుత్వం చేస్తుంది. గత BRS ప్రభుత్వం సమయంలో డ్యూస్ పెరిగాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరింత ఆలస్యమవుతున్నాయని కాలేజీలు ఆరోపిస్తున్నాయి.  50% డ్యూస్ సుమారు ₹5,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే అనుమతి రాలేదు. ఇప్పుడు రేవం త్ స్ట్రాంగ్ వార్నింగ్ బహిరంగంగా ఇవ్వడంతోకాలేజీలు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.