Rangareddy Court: హైదరాబాద్‌ సరూర్ నగర్ లో సంచలనం సృష్టించిన నాగరాజు హత్య కేసులో రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులకు జీవిత ఖైదు విధించించింది. వివరాలు.. రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన బిల్లారపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్‌ వాసి ఆశ్రిన్‌ సుల్తానా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం యువతి సోదరులకు ఆగ్రహం తెప్పించింది. మతాంతర వివాహం చేసుకున్నారనే కోపంతో యువతి సోదరుడు మోబిన్ అహమ్మద్ నడిరోడ్డుపై నాగరాజును గత ఏడాది మే 4 తేదీ దారుణంగా హత్య చేశాడు. 


ఈ కేసులో ఏ-1 మోబిన్ అహమ్మద్, ఏ-2 మసూద్ అహ్మద్ ఉన్నారు. పోలీసులు 120బి, 341, 302, రెడ్ విత్ 34, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. నిందితులైన మోబిన్ అహమ్మద్, మసూద్ అహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. విచారణలో నిందితులు హత్య చేసినట్లు తేలడంతో వారికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతోపాటు రూ.1000 జరిమానా విధించారు


ఏం జరిగిందంటే?
రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన బిల్లారపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్‌ వాసి ఆశ్రిన్‌ సుల్తానా కలిసి చదువకున్నారు. అప్పటి నుంచే ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న ఆశ్రిన్‌ బంధువులు నాగరాజును హెచ్చరించారు. ఆమె వెంట తిరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రమాదాన్ని గ్రహించిన నాగరాజు హైదరాబాద్‌లో ఉద్యోగం వెతుక్కున్నాడు. ఓ కంపెనీలో సేల్స్‌మెన్‌గా చేరాడు. స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఆశ్రిన్‌కు చెప్పాడు.


అనుకున్నట్టుగానే లైఫ్‌లో స్థిరపడ్డ తర్వాత ఆశ్రిన్‌కు కబురు పెట్టాడు. జనవరిలో ఇంట్లో చెప్పకుండా ఆశ్రిన్ హైదరాబాద్‌ వచ్చేసింది. 2022 జనవరి 31న ఆశ్రిన్ సుల్తానాను ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నాడు. నాగరాజు, ఆశ్రిన్ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్న విషయం తెలుసుకుని తమ జాడ తెలియకుండా ఉండేందుకు ఉద్యోగం, నివాసాన్ని కూడా మార్చేశారు.


ఆశ్రిన్, నాగరాజు ఎన్ని ప్లేస్‌లు మారుతున్నా ఆమె బంధువులు వదల్లేదు. దీంతో నాగరాజు, ఆశ్రిన్ విశాఖపట్టణం పారిపోయారు. విశాఖపట్టణం నుంచి గత ఏడాది మే మాసంలో హైద్రాబాద్‌కు వచ్చారు. అయితే  నాగరాజు, ఆశ్రిన్ హైద్రాబాద్ కు వచ్చిన విషయాన్ని ఆమె సోదరులు తెలుసుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించి నాగరాజు కదలికలను గుర్తించేవారు.  


మృతుడు నాగరాజు, సయ్యద్ సోదరి చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. అనంతరం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. యువతి సోదరుడు సయ్యద్ అప్పటి నుంచి నాగరాజుపై కోపం పెంచుకున్నాడు. నాగరాజును ఎలాగైనా హతమార్చాలని స్కెచ్ వేశాడు. నాగరాజు ఎక్కడ ఉంటున్నాడు? అతనికి అండగా ఎవరు ఉన్నారు? రోజు ఎక్కడికి వెళ్తాడు? ఎప్పుడు వస్తారు? చంపడానికి అనువైన సమయం ఏంటి? అని పూర్తిగా ఆరా తీశాడు. అనుకున్న ప్రకారం ప్లాన్ అమలు చేశాడు.


2022 మే 4 తేదీ నాగరాజు, ఆశ్రిన్ గురించి ప్రధాన నిందితుడు ప్లాన్ ప్రకారం బైక్ పై వెళ్తోన్న వారిని కొట్టి చంపాడు. ఆశ్రిన్  ప్రాధేయపడుతున్నా వినకుండా నాగరాజును హత్య చేశారు.  స్థానికులు ఆశ్రిన్ సోదరులను పట్టుకొని  పోలీసులకు అప్పగించారు.  గతంలో కూడా నాగరాజును చంపడానికి ప్లాన్ చేసి విఫలమయ్యాడు. ఈ కేసుపై రంగారెడ్డి జిల్లా కోర్లులో విచారణకు రాగా నిందితులకు న్యాయ స్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.