Raja Singh : ప్రాణం పోయినా తాను బీఆర్ఎస్, కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీల్లోకి వెళ్లనని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తనకు టికెట్ ఇవ్వకుంటే.. రాజకీయలు పక్కన పెడతా కానీ.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనని రాజా సింగ్ స్పష్టం చేశారు.  తెలంగాణ హిందూ రాష్ట్రంగా చేయడమే తన లక్ష్యమని రాజా సింగ్ పేర్కొన్నారు. బీజేపీ అధిస్టానం తనకు సానుకూలంగా ఉందని.. సరైన సమయం చూసి తనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తారని రాజా సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు  టికెట్‌ ఇవ్వకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని  గ్ అన్నారు. 


బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోతే తెలంగాణను హిందూ రాష్ట్రంగా చేసేందుకు ఉద్యమం                            


బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోతే స్వతంత్రంగా లేదా, ఇతర పార్టీల నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సెక్యులర్‌ పార్టీల్లోకి వెళ్లనని,. ప్రాణం పోయినా బిఆర్ఎస్, కాంగ్రెస్‌లో చేరబోనని తేల్చి చెప్పారు… గోషా మ‌హాల్ స్థానానికి బిఆర్ఎస్ అభ్య‌ర్ధి ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం ఆయన సెటైర్లు వేశారు.  ఆ సీటు ఎవ‌రికి కేటాయించాల‌నేది ఎంఐఎం నిర్ణ‌యిస్తుంద‌ని ఎద్దేవా చేశారు.. మ‌జ్లిస్ పార్టీ సూచించిన అభ్య‌ర్ధే ఇక్క‌డ కారు గుర్తుపై పోటీ చేస్తార‌ని తెలిపారు. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉంది..అందుకే పెండింగ్ పెట్టారన్నారు.  దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారన్నారు. 


జహీరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని హైకామండ్ ఒత్తిడి                           


గోషామ‌హ‌ల్ స్థానాన్ని వ‌దులుకొని, 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌హీరాబాద్ లోక్‌స‌భ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాల‌ని రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం తీవ్ర ఒత్తిడి తెస్తున్న‌ట్లుగా ప్రచారం జరుగుతోంది.  జ‌హీరాబాద్ లోక్‌స‌భ స్థానం నుంచి పోటీకి ఒప్పుకుంటేనే స‌స్పెన్ష‌న్ తొల‌గించే అంశంపై ఓ నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అధిష్టానం రాజాసింగ్‌కు సూచించిన‌ట్లు తెలుస్తోంది. అందుకే ఆయ‌న స‌స్పెన్ష‌న్‌పై జాప్యం జ‌రుగుతోంద‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి.  గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌పున మాజీ మంత్రి, దివంగ‌త ముకేశ్ గౌడ్ కుమారుడు విక్ర‌మ్ గౌడ్‌ను పోటీ చేయాల‌ని పార్టీ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో గోషామ‌హ‌ల్‌ను వ‌దిలిపెట్టాల‌ని రాజాసింగ్‌కు అధిష్టానం సూచించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.


సస్పెన్షన్ పై నిర్ణయం తీసుకోని బీజేపీ హైకమాండ్ 


అయితే పార్టీ అధిష్టానం డిమాండ్‌కు రాజాసింగ్ అంగీక‌రించ‌లేద‌ని తాను గోషామహల్ ను వదిలి పెట్టేది లేదని చెబుతున్నారు.  గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో రాజాసింగ్‌కు మంచి ప‌ట్టుంది. మ‌ద్ద‌తుదారులు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలి ఎక్క‌డికి వెళ్లొద్ద‌ని ఆయ‌న‌కు సూచించిన‌ట్లు స‌మాచారం. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున గెలుపొందిన ఏకైక వ్య‌క్తి రాజాసింగ్ మాత్ర‌మే. అందుకే.. రాజాసింగ్ విషయంలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.