Railway Department Good News To Telangana: తెలంగాణకు రైల్వే శాఖ (Railway Department) గుడ్ న్యూస్ చెప్పింది. విభజన హామీల్లో మరో హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (Kazipet Railway Coach Factory) ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్ గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది జులై 5వ తేదీన అప్ గ్రేడ్ చేయాలని ద.మ రైల్వే జీఎంకు రైల్వే బోర్డు లేఖ రాసింది. అప్ గ్రేడ్ చేసిన యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌లు తయారు చేసేందుకు అనుగుణంగా యూనిట్‌ను అభివృద్ధి చేయాలని ఈ ఏడాది సెప్టెంబర్ 9న రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది. కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల తయారీకి సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించాలని రైల్వే బోర్డు సూచించింది. కాగా, విభజన హామీల అమలుపై తెలంగాణ అధికారులు, కేంద్ర అధికారులతో హోంశాఖ నిర్వహించిన భేటీలో ఈ విషయం వెల్లడైంది.
Also Read: Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు