TS Zodo Yatra :   రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి అడుగు పెట్టే ముహుర్తం ఖరారయింది.  అక్టోబర్ 23న రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రవేశిస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ ప్రకటించారు.   మహబూబర్ నగర్ జిల్లాలో రాహుల్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం మాణిక్కం టాగూర్ పరిశీలించారు. 14 రోజుల మక్తల్  నియోజకవర్గం కృష్ణా మండలం, కృష్ణా గ్రామం వద్ద తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుందిపాటు రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పారు. ఈ యాత్రలో భాగంగా ప్రతి రోజు సాయంత్రం పూట రాహుల్  ప్రజలతో మమేకమవుతారని పేర్కొన్నారు. 


షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న మక్తల్ దగ్గర రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించాలి. అయితే మార్చిన షెడ్యూల్ ప్రకారం 23వ తేదీనే మక్తల్ సమీపంలోని కృష్ణా బ్రిడ్జి వద్ద రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ఎంటర్ కానున్నది. అనంతరం రెండు రోజుల పాటు యాత్రకు విశ్రాంతి ఇవ్వనున్నారు. దీపావళి సందర్బంగా యాత్ర రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇటీవల దసరా సందర్భంగా కూడా రెండు రోజుల పాటు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 23న తెలంగాణలోకి రాహుల్ యాత్ర ఎంటర్ అయినా.. ఆ తర్వాత 26 నుంచి మాత్రమే కొనసాగనున్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 


ప్రజల కష్టాలను తెలుసుకోవడానికే రాహుల్ ఈ యాత్ర చేపట్టారని, యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. మోడీ ప్రభుత్వ కార్పొరేటీకరణ, నిరుద్యోగ సమస్యే ఎజెండాగా రాహుల్ యాత్ర సాగుతోందని ప్రకటించారు.  దీనికి సంబంధించిన మినిట్ టూ మినిట్ రూట్ మ్యాపును కాంగ్రెస్ సిద్ధం చేస్తోంది. మక్తల్ నుంచి జుక్కల్ వరకు పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ  దాదాపు 350 కిలోమీటర్ల మేర నడవనున్నారు.  ఈ యాత్రలో రాహుల్ గాంధీతో రోజుకో టీం ఉండేలా కార్యాచరణ రూపొందించారు. పాదయాత్రకు తెలంగాణ కాంగ్రెస్ నేతలుచేస్తున్న సన్నాహాలపై  మాణిగం ఠాగూర్ సంతృప్తి వ్యక్తం చేశారు. 


రాహుల్ గాంధీ పాదయాత్రను కనీ వినీ ఎరుగని రీతిలో సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు .ఇప్పటికే పాదయాత్రలు జరిగే జిల్లాల్లో పార్టీ నేతలు కీలక సమావేశాలు నిర్వహించారు. భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. గ్రేటర్ పరిధిలో కూడా పాదయాత్ర జరగనుంది. జన ప్రభంజనం సృష్టించాలని పార్టీ నేతలు నిర్ణయించారు.