Telangana Congress Delhi :  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో జులై రెండో ేదీన  ఆ పార్టీలో చేరనున్నారు.  సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ  కార్యాలయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని వారిద్దరితో పాటు కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్న ఇతర నేతలు కలిశారు. జులై 2వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్న సభకు రావాలని రాహుల్ ను టీపీసీసీ నేతలు ఆహ్వానించారు. ఆ సభలోనే మరింత మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణ నేతలతో అరగంట పాటు మాట్లాడారు. 


కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో నినాదంతో వెళ్లాలని రాహుల్ సలహా ఇచ్చారు. 


కాంగ్రెస్ నేతలు అందరూ మళ్లీ సొంత పార్టీలోకి రావడం పట్ల రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఘర్ వాపసీ జరుగుతుందని చెప్పారు. కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో నినాదంతో ముందుకు సాగాలని సలహా ఇచ్చారు. దాదాపుగా యాభై మంది  నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తూ ఏఐసీసీ ఆఫీసుకు వచ్చారు. వారితో పాటు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతులు..  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తె జానారెడ్డి, చిన్నా రెడ్డి , రేణుకా చౌదరి సహా కీలక నేతలంతా వచ్చారు. ఈ సందర్భంగా ఏఐసిసీ కార్యాలయం సందడిగా మారింది. నేతలందరితో  ఖర్గే, రాహుల్ గాంధీ ఫోటో సెషన్ నిర్వహించారు. 


ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే కాంగ్రెస్‌లో చేరిక 


తెలంగాణ ఏర్పాటు ఆకాంక్షలు స్వరాష్ట్రంలో ఒక్కటి కూడా నెరవేరలేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ తో భేటీ తర్వాత ఏఐసీసీ కార్యాలయంలో కీలక నేతలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగాకీలక వ్యాఖ్యలు చేశారు. తము పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సర్వేలు చేయించామని బీఆర్ఎస్ పై ఎనభై శాతం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఓ దశలో తాము ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా చేశామని..కానీ వ్యతిరేక ఓట్లు చీలకూడదని..కేసీఆర్‌కు మేలు జరగకూడదన్న ఉద్దేశంతోనే తాము కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకుమన్నారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవ్వాల్సి ఉందని పొంగులేటి పిలుపునిచ్చారు. 


వచ్చే ఆదివారం బీఆర్ఎస్ సభ కంటే భారీ సభ


వచ్చే ఆదివారం రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని  ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఆ పార్టీ నిర్వహించిన సభ కంటే భారీ సభ నిర్వహిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. తనకు బిజినెస్‌లే కావాలంటే..తాను కాంగ్రెస్ లో చేరేవాడిని కాదన్నారు. 
  


 
ఖమ్మం సభలో కాంగ్రెస్‌లో చేరనున్న నేతలు వీరే..



జూపల్లి కృష్ణారావు


పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
గుర్నాథ్ రెడ్డి
కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
తాడిపర్తి సాయి చరణ్ రెడ్డి
మేఘారెడ్డి తుడి
కూర అన్న కిష్టప్ప
ముద్దప్పా దేశ్ ముఖ్
జూపల్లి అరుణ్
సూర్య ప్రతాప్ గౌడ్
కల్యాణ్ కుమార్ కొత్త
దండు నర్సింహ
సానే కిచ్చా రెడ్డి
గోపిశెట్టి శ్రీధర్
సూర్య
కోరం కారకయ్య
పాయం వెంకటేశ్వర్లు
మువ్వా విజయ బేబీ
తెల్లం వెంకటరావు
పిడమర్తి రవి
జారే ఆది నారాయణ
బానోత్ విజయ.
తెల్లూరి బ్రహ్మయ్య
మద్దినేరి స్వర్ణ కుమారి
బొర్రా రాజశేఖర్
కోట రాంబాబు
ఊకంటి గోపాల్ రావు
డా.రాజా రమేశ్
జూపల్లి రమేశ్
అయిలూరి వెంకటేశ్వర రెడ్డి
హనుమాండ్ల జాస్ని రెడ్డి
రఘునాథ్ యాదవ్
రాఘవేంద్ర రెడ్డి
కేతా మనోహర్ రెడ్డి
సుతగాని జైపాల్


 





Join Us on Telegram: https://t.me/abpdesamofficial