Punjab CM : బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విమర్శించారు. బీజేపీ చేస్తోంది లోక్ తంత్ర కాదని లూట్ తంత్రా. యువతకు, రైతులకు, మహిళలకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు నెరవేర్చలేదు. రైతులు ఆదాయాలు రెట్టింపు చేస్తామని మోసం చేశారని విమర్శించారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజల ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామన్నారు. ఇంత వరకు వేయలేదు. దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లోనూ కుట్రలు చేశారు. లూటీ చేయడం అమ్మడమే బీజేపీ సిద్ధాంతమని భగవంత్ సింగ్ మాన్ విమర్శించారు.
విపక్షాల ఎమ్మెల్యేలను కొనాలి.. అధికారంలోకి రావాలి ఇదే బీజేపీ సూత్రం అని పంజాబ్ సీఎం మండిపడ్డారు. అన్ని సమయాలు ఒకేలా ఉండవని, రాజు బికారి అవుతాడని, బికారి రాజు అవుతాడని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశమనే పుష్ఫగుచ్ఛంలో అన్ని రకాల పువ్వులు ఉంటేనే బాగుంటుందన్నారు. కానీ కొందరు ఒకే రకమైన పువ్వును కోరుకుంటున్నారని విమర్శించారు.దొడ్డి దారిలో అధికారంలోకి రావడంలో బీజేపీ నంబర్ వన్ అని ... మోదీ ప్రజల కోసం కాదు తన మిత్రుల కోసం పని చేస్తున్నారని అన్నారు. ఎర్రకోటపై మోదీ 8 ఏళ్లుగా ఒకేరకమైన మాటలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజల జీవితాలను మోదీ ఎలాగూ మార్చలేకపోతున్నారని, కనీసం తన ప్రసంగాన్నైనా మార్చుకోవాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వంపై మాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇవాళ చాలా మంచి ప్రోగ్రామ్‌ను చూశానని.. ప్రజలకు ఉచిత కళ్ల అద్దాలు ఇవ్వడం. వారి సంక్షేమం కోసం చేపట్టే ఈ కార్యక్రమం చాలా మంచి ప్రయోజనాలు ఇవ్వనుంది. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున జనం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు ఖమ్మం సభలో భారీ జనసందోహాన్ని చూసి భగవంత్‌మాన్ ఉప్పొంగిపోయారు. ఇంతమందిని చూడటానికి కేసీఆర్ తమకు ప్రత్యేక అద్ధాలు ఇవ్వాలంటూ చమత్కరించారు.
ప్రతి ఆగస్టుకు ప్రధాని ఢిల్లీ నుంచి సందేశం ఇస్తారని, కానీ ఎప్పుడూ ఆ ఉపన్యాసమే ఉంటుందని ఆయన విమర్శించారు. ఉగ్ర దాడుల పట్ల చింతను వ్యక్తం చేస్తూ.. ప్రధాని తన ప్రసంగాన్ని ముగిస్తారని, ఆ ప్రసంగాన్ని మార్చుకోవాలని సీఎం భగవంత్ మాన్ సూచించారు. అ కేజ్రీవాల్ స్కూళ్ల గురించి బీజేపీ సర్కార్ విమర్శలు చేసిందని, కానీ ట్రంప్ సతీమణి స్కూల్ చూడాలంటే, కేజ్రీవాల్ స్కూల్‌ను చూపించారని భగవంత్ విమర్శలు చేశారు. మంచి హృదయం ఉన్న నేతలు ఈ దేశంలో లేరని, వాళ్లుంటే ఈ దేశం సస్యశ్యామలం అవుతుందన్నారు. తన ప్రసంగం ముగించే ముందు ఇన్‌కిలాఫ్ నినాదం చేశారు. జిందా రహేతో ఫిర్ మిలేంగే.. మిల్తే రహేతో జిందా రహీంగే అంటూ భగవంత్ మాన్ పిలుపునిచ్చారు.