DS sons Politics in Nizamabad:  నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ధర్మపురి సంజయ్ ప్రమాణ స్వీకారానికి ఆయన సోదరుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరవుతారా అన్నది ప్రశ్నగా మారింది.  మాజీ రాజ్యసభ సభ్యుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ పార్టీలకతీతంగా అధ్యక్ష ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Continues below advertisement

ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారధులను అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెందిన బొత్స సత్యనారాయణను ఆహ్వానించారు .అందులో భాగంగానే నిజామాబాద్ ఎంపీ తన సోదరుడైన ధర్మపురి అరవింద్ ను ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించారు . మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ధర్మపురి అరవింద్ కు ఆయన సోదరుడు మున్నూరు కాపు జిల్లా సంఘం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సంజయ్ కు మధ్య కుటుంబ కలహాలతో పాటు రాజకీయ వైరుధ్యం కూడా ఉన్నది. 

ధర్మపురి శ్రీనివాస్ ఇద్దరు కుమారులు ఆయన అంతిమయాత్రలోని ఒకే వేదికను పంచుకోలేదు.  ఆ తర్వాత కూడా కుటుంబ కలహాల కారణాలవల్ల వారిద్దరూ కలిసిన దాఖలాలు లేవు . మున్నూరు కాపు జిల్లా అధ్యక్ష పదవిని స్వీకరిస్తున్న సంజయ్  ఆహ్వానంతో   ఒకే వేదికను పంచుకుంటారా అన్నది ఇప్పుడు జిల్లాలో చర్చ గా మారింది. ధర్మపురి సంజయ్ ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నగరానికి చేరుకున్నారు. కానీ నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్  నగరానికి రాకపోవడంతో ఆయన అన్నతో కలిసి వేదికని పంచుకోరు పని బిజెపి కార్యకర్తలు అంటున్నారు.  

Continues below advertisement

ధర్మపురి అరవింద్ తన సోదరుడు సంజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని మున్నూరు కాపు బొలోపేతానికి తాను కూడా ముందుంటానని వారిలో తన పట్ల వ్యతిరేకత రాకుండా చూసుకుంటారని మరి కొంతమంది అంటున్నారు. మరి వేచి చూడాలి సంజయ్ ప్రమాణ స్వీకారానికి నిజామాబాద్ ఎంపీ అరవింద్ హాజరవుతారా లేదా అన్నది.                                           

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మేయర్   సంజయ్‌పై మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి.  అరెస్ట్ కూడా అయ్యారు.  ఇది కుటుంబ ఇమేజ్‌కు దెబ్బ తీసింది.  తండ్రి ధర్మపురి శ్రీనివాస్  2021లో మరణించిన తర్వాత, సంజయ్ కాంగ్రెస్‌లోనే ఉన్నాడు. అరవింద్ 2019లో బీజేపీలో చేరి, కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి ఎంపీ అయ్యారు. 2024లో రెండో సారి గెలిచారు.    సంజయ్ 2021 నుంచి కాంగ్రెస్‌లోనే ఉండటంతో, అరవింద్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి.