Politics Over Medigadda : తెలంగాణలో భారీ వర్షాలు కరుస్తూండటంతో గోదావరిలో వరద వస్తుంది. ఈ కారణంగా  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీల్లో జల కళ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ వద్ద కూడా నీరు సమృద్ధిగా ఉంది. ప్రాజెక్టులో అన్ని గేట్లను ఎత్తి ఉంచారు. దీంతో వచ్చిన నీరు వచ్చినట్లుగా కిందకు పోతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు మేడిగడ్డ దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బ్యారేజీ కూలిపోయిందని ప్రచారం చేశారని కానీ ఇప్పుు నిండు కుండలా ఉందని  చూడాలని .. కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. 


మేడిగడ్డ బ్యారేజీ లో కొన్ని పిల్లర్లు కుంగిపోయాయి. వర్షం వచ్చి భారీ వరద వస్తే ప్రాజెక్టు కూడా కొట్టుకుపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం ఇటీవల కొన్ని తాత్కలిక మరమ్మతులు చేయించింది. ప్రాజెక్టులో నీరు నిల్వ చేస్తే ప్రమాదమేనని వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదలేయాలని సూచించారు. దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తివేశారు. అయితే బీఆర్ఎస్ నేతలు స్వయంగా కేటీఆర్ కూడా స్పందించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో..కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయన్నారు. 


 



 


కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కేటీఆర్ కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. అసలు ప్రాజెక్టు నిర్మించినది ఎందుకని ప్రశ్నించింది. నీళ్లు నిలిపితే కొట్టుకుపోయే ప్రాజెక్టును ఎవరు నిర్మిస్తారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నీరు నిలబెట్టలేని ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 


 





 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి వచ్చిన పగుళ్ల అంశం చర్చనీయాంశం అయింది.  ఓ దశలో అదే గెలుపొటములను నిర్దేశించే రాజకీయ అంశంగా మారడంతో కాంగ్రెస్ అడ్వాంటేజ్ తీసుకుది.  డిగడ్డ బ్యారేజీకి ఏర్పడ్డ పగుళ్లను చూపిస్తూ.. ఇక ఆ బ్యారేజీ వేస్ట్ అని ప్రచారం చేసింది. దాని రిపేర్ చేయలేమని, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పెట్టిన ఖర్చు మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అని కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లింది. ఇప్పటికీ అదే చెబుతోంది. నీరు నిలుపలేకపోతే లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టులు  ఎందుకు అని ప్రశ్నిస్తోంది. 


ప్రస్తుతం మేడిగడ్డ భద్రతపై నిపుణులు కూడా ఆందోళన చెందుతున్నారు. వరద వచ్చి వెళ్లిపోయిన తరవాత ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంటుందోనని కంగారు పడుతున్నారు.