Chevella bus accident Politics: చేవెళ్ల వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఘటన తెలంగాణను విషాదంలో నింపింది. అనూహ్యంగా వేగంగా వస్తున్న టిప్పర్ బస్సును ఢీకొట్టి..బస్సుపై పడిపోయింది. టిప్పర్ లో ఉన్న కంకర్ అంతా వారిపై పడటంతో ఎక్కువ ప్రాణాలు పోయాయి. ప్రమాదానికి కారణం వేగంగా వస్తున్న టిప్పర్ గుంతలో పడటం వల్ల డ్రైవర్ లారీని కంట్రోల్ చేయలేకపోయాడని అదే సమయంలో బస్సు ఎదురుగా ఉండటంతో పెను ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. అంటే ప్రధానంగా కారణం రోడ్డుపై గుంతలు. చెవెళ్ల రహదారి ప్రమాదకరంగా మారిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడమే కారణం అని బీఆర్ఎస్.. పదేళ్లు అధికారం ఉండి బీఆర్ఎస్ చేసిన నిర్వాకమే అని కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. కానీ నిజం మాత్రం ఇరవై మంది ప్రాణాలు పోవడం.
రోడ్ విస్తరించకపోవడం వల్లనే ప్రమాదాలు ప్రమాదం జరిగింది NH-163 రహదారిపై. ఈ 14 కి.మీ. స్ట్రెచ్‌పై గత ఏడాది 70కి పైగా ప్రమాదాలు జరిగాయి. రోడ్డు రెండు దిశల్లో 7 మీటర్ల మాత్రమే వెడల్పు కలిగి ఉంది. ట్రక్కులు, బస్సులు, ప్రైవేట్ వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. దాని వల్ల ప్రమాదాలు కూడా పెరిగాయి. స్థానిక వ్యాపారులను రోడ్డును కొద్దికొద్దిగా కబ్జా చేయడంతో మరింత తగ్గిపోయింది. స్థానికల ప్రకారం, అతివేగం కాకుండా రోడ్ చిన్నగా ఉండటం వల్లనే ప్రమాదాలు పెరిగాయి. NH-163 చెవెళ్ల-బీజాపూర్ హైవే విస్తరణకు NHAI 2019 నుంచి ప్లాన్ చేస్తోంది. కానీ, రోడ్డు రెండు పక్కల్లో 900కి పైగా 200 ఏళ్ల పాత ఆలవంకల (బానియన్ చెట్లు) , 10,000 మరిన్ని చెట్లు కట్ చేయాల్సి ఉంటుందన్న కారణంగా కొంత మంది పర్యావరణ వేత్తలు ఉద్యమం ప్రారంభించారు. దీనికి 'సేవ్ చెవెళ్ల బానియన్స్' గ్రూప్ 2019లో పిటిషన్ స్టార్ట్ చేసి 2021లో NGTలో పిటిషన్ వేశారు.
ప్రత్యామ్నాయాలు వెదకాలని సూచించిన ఎన్జీటీ
NGT 2025 మార్చిలో ఫ్రెష్ స్టడీ ఆర్డర్ ఇచ్చింది. ప్రత్యామ్నాయ అలైన్ మెంట్స్ చూడాలని చెప్పింది. "చెట్లు హెరిటేజ్, ట్రాన్స్‌లోకేషన్ చేసి సేవ్ చేయాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. "చెట్లు మనుషుల జీవితాల కంటే ముఖ్యమా?" అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. NHAI 522 చెట్లు ట్రాన్స్‌లోకేట్ చేసి, 393 రీటైన్ చేయాలని ప్లాన్ చేసింది. ప్రమాదం తర్వాత 200-300 మంది లోకల్స్, పాలిటికల్ పార్టీల ప్రతినిధులు చెవెళ్ల బస్ స్టాండ్ నుంచి అగ్రికల్చర్ మార్కెట్‌కు ర్యాలీ చేసి, ఒక గంట ధర్నా నిర్వహించారు. "రోడ్ విస్తరించండి " అని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లేనని చేవెళ్ల ఎంపీ విమర్శలు
ఈ ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని.. చేవెళ్లకు సంబంధం లేని కొందరు చెట్ల పరిరక్షణ పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అంటున్నారు.
చేవెళ్లకు సుదీర్ఘ కాలంగా ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం వల్లే ఇదంతా జరిగిందారు.
ఆయనపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. దశాబ్దాలుగా చేవెళ్ల నుంచి రాజకీయం చేసిన వారు మంచిరోడ్లు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
ఈ రాజకీయ వాదోపవాదులతో ఏమీ తేలుతుందో కానీ.. నిర్లక్ష్యం వల్ల ఇరవై ప్రాణాలు గాల్లో కలసిపోయాయి.