Bengaluru techie kills manager with dumbbell:  బెంగళూరులోని ఒక డిజిటల్  వరల్డ్,  ఫోటో-ఎడిటింగ్ కంపెనీలో రాత్రి షిఫ్ట్ సమయంలో జరిగిన చిన్న గొడవ భయంకర హత్యకు కారణం అయింది.  41 ఏళ్ల మేనేజర్ భీమేష్ బాబును అతని సహోద్యోగి, 24 ఏళ్ల టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ సోమల వంశీ డంబెల్‌తో కొట్టి చంపేశాడు. ఈ ఘటనకు కారణం  ఆఫీస్‌లో అనవసర లైట్లు ఆఫ్ చేయాలని అడిగిన విషయంలో రేగిన వివాదమే.  పోలీసులు.. మేనేజర్ ను హత్య చేసిన  వంశీని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

Continues below advertisement

ఘటన సరస్వతీనగర్‌లోని ఎంసీ లేఅవుట్ సమీపంలోని 'డేటా డిజిటల్ బ్యాంక్' కంపెనీ ఆఫీసులో నవంబర్ 1 శనివారం రాత్రి 1:00 గంటల సమయంలో జరిగింది. ఈ కంపెనీ సినిమా షూటింగ్ వీడియోలను డైలీ స్టోరేజ్ చేసే డిజిటల్ వాల్ట్ సర్వీస్‌ను అందిస్తుంది. రాత్రి షిఫ్ట్‌లో పని చేస్తున్న భీమేష్ బాబు , సోమల వంశీ మధ్య లైట్లపై జరిగిన తీవ్రమైన వాదన హింసాత్మక దాడిగా మారి హత్యకు దారి తీసింది. 

చిత్రదుర్గ జిల్లా నివాసి భీమేష్ బాబు (41) తన ఆఫీసులో బ్రైట్ లైట్ల విషయంలో ఇబ్బందికరంగా ఉండేవాడు.  అనవసర లైట్లు ఆఫ్ చేయాలని సహోద్యోగులను తరచూ కోరేవాడు. విజయవడకు విజయవాడ  చెందిన సోమల వంశీ (24) కంపెనీలో కొంత కాలంగా పని చేస్తున్నారు.  అర్థరాత్రి ఒంటి గంటలకు  వీడియో ఎడిటింగ్‌లో మునిగి ఉన్న సమయంలో  ...  బాబు వంశీని చూసి, "లైట్లు ఆఫ్ చేయి" అని అడిగాడు. దీనికి వంశీ కోపంతో వంశీ స్పందించాడు. ఆ వాదన అంతకంతకూ పెరిగిపోయింది.  

Continues below advertisement

వాదన తీవ్రమై, దాదాపు 1:30 నిమిషాలకు  ఘర్షణకు దిగారు.  కోపంలో వంశీ మిరప కాయ పొడి  బాబుపై విసిరేశాడు. ఆ తర్వాత రూములో ఉన్న ఇనుము డంబెల్‌ను పట్టుకుని, బాబు తల, ముఖం, ఛాతీలపై బలవంతంగా ఒక్కసారిగా కొట్టాడు. బాబు  కూలిపోయాడు, అక్కడే మరణించాడు.

భయపడిపోయిన వంశీ ఆఫీసు నుంచి పరిగెత్తి, తన సహోద్యోగి గౌరి ప్రసాద్‌ను నయందహళ్ళిలో కలిశాడు. ప్రసాద్ తన స్నేహితుడిని తీసుకుని మళ్లీ ఆఫీసుకు వచ్చి, బాబును చూసి ఆంబులెన్స్ పిలిచారు.  ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వైద్యులు బాబును మరణించాడని ప్రకటించారు. ఘటన తెలుసుకున్న వెంటనే వంశీ గోవిందరాజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో స్వయంగా సరెండర్ అయ్యాడు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. దర్యాప్తులో పోలీసులు ఘటనా స్థలంలో డంబెల్, మిరప కాయ పొడి మొదలైన సాక్ష్యాలను సేకరించారు.

పశ్చిమ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్. గిరీష్ మాట్లాడుతూ, "లైట్లు ఆఫ్ చేయాలనే అభ్యంతరమే ఈ హత్యకు తక్షణ కారణం.  భీమేష్ బాబు చిత్రదుర్గకు చెందినవాడు. ఈ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తూ, రాత్రి షిఫ్ట్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.  సోమల వంశీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. టెక్నికల్ ఎగ్జిక్యూటివ్‌గా వీడియో ఎడిటింగ్ వంటి పనులు చేస్తున్నాడు.