PM Vidya Laxmi Scheme: ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి (PM Vidya Laxmi) పథకం కింద ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి పథకం, NIRF ర్యాంకింగ్ ఆధారంగా ఎంపిక చేసిన టాప్ 860 హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థలలో అడ్మిషన్లు పొందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు, ఎలాంటి హామీ లేకుండా రూ.0 లక్షల వరకు విద్యా రుణాలను అందిస్తారు. 2024, నవంబర్ 6 కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఆమోదించింది.
ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి (PM-Vidyalaxmi) స్కీమ్
పీఎం విద్యాలక్ష్మి పథకం కింద రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు రూ.7.5 లక్షల వరకు రుణాలపై 75% క్రెడిట్ గ్యారెంటీ, మారటోరియం సమయంలో 3% వడ్డీ రాయితీ అందిస్తారు. ఈ స్కీమ్ కు 2024-25 నుంచి 2030-31 వరకు రూ.3,600 కోట్లు కేటాయించారు. NIRF ర్యాంకింగ్‌ల ఆధారంగా టాప్ 860 క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్ స్ట్యూషన్స్ (QHEI)లలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. రూ.10 లక్షల వరకు విద్యా రుణాలను 3% వడ్డీ రాయితీకి అందిస్తుంది. క్రెడిట్ గ్యారెంటీ డిఫాల్ట్ అయితే రూ.7.5 లక్షల వరకు రుణాలపై 75% క్రెడిట్ గ్యారెంటీ ఇస్తుంది. ఏటా 22 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారు.
విద్యాలక్ష్మి పోర్టల్
విద్యా లక్ష్మి పోర్టల్(https://pmvidyalaxmi.co.in/Index.aspx) లో భారత్ లేదా విదేశాలలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులకు సింగిల్ విండో విధానం ద్వారా విద్యా రుణ దరఖాస్తు చేసుకోవచ్చు. 37కు పైగా బ్యాంకులు ఈ పథకాలను అందిస్తున్నాయి. ఒకేసారి మూడు బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యా లక్ష్మి పథకం అర్హతలు
- దరఖాస్తుదారు భారత పౌరుడై ఉండాలి.
- విద్యార్థులు దేశంలోని టాప్ 860 విద్యాసంస్థలలోని ఏదైనా ఒక సంస్థలో యాజమాన్య కోటా లేకుండా మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు పొందాలి.
- సంవత్సరానికి రూ.8 లక్షల వరకు ఆదాయం కుటుంబాలకు 3% వడ్డీ రాయితీ ప్రయోజనానికి అర్హులు.
- ఈ పథకానికి అర్హులైన వారికి, ఇతర కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్, సబ్సిడీ లేదా ఫీజు రీయింబర్స్‌మెంట్ అనుమతించరు.
- పూర్తి సబ్సిడీ పొందేందుకు పూర్తి కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.
- UG/PG/ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌కు ఒక్కసారి రుణ ప్రయోజనాలు పొందుతారు.
- కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మొత్తం NIRF ర్యాంకింగ్‌లలో మొదటి 100 స్థానాల్లో నిలిచిన ఉన్నత విద్యా సంస్థలు
- NIRF టాప్ 200 ర్యాంకులలో చోటు దక్కించుకున్న రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల ఉన్నత విద్యా సంస్థలు
- భారత ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు(టాప్ ర్యాంకులలో లేనప్పటికీ)
కావాల్సిన డాక్యుమెంట్స్
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- అడ్రస్ ఫ్రూఫ్
- గత విద్యకు సంబంధించిన మార్కు షీట్లు
- అడ్మిషన్ టెస్ట్ రిజల్ట్స్
- జాయిన్ అయ్యే కాలేజీ/విద్యాసంస్థ నుంచి ఆఫర్ లెటర్ (ఫీజు వివరాలతో)
- ఆదాయ ధృవీకరణ పత్రం
విద్యా లక్ష్మి దరఖాస్తు విధానం?
విద్యా లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా అధికారిక పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతులలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ విధానం
- పీఎం విద్యాలక్ష్మి పథకం (https://pmvidyalaxmi.co.in/) అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి.
- హోమ్ పేజీలోని లాగిన్ పై క్లిక్ చేసి క్రియేట్ యాన్ అకౌంట్ పై క్లిక్ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
- యాక్టివేషన్ లింక్ కోసం మీ ఇ-మెయిల్‌ను పంపిస్తారు. దాన్ని వెరిఫై చేసిన తర్వాత లాగిన్ అవ్వండి.
- మీ వ్యక్తిగత వివరాలు, విద్య వివరాలు, కోర్సు, కుటుంబ ఆదాయ వివరాలు, బ్యాంకు అకౌంట్ సమాచారాన్ని అందించండి.
- ఆధార్, పాన్, అడ్మిషన్ లెటర్, ఫీజు వివరాలు, ఆదాయ ధృవీకరణ పత్రం వంటివి అప్‌లోడ్ చేయాలి.
- సబ్మిట్ కు ముందు అప్లికేషన్ ను ప్రివ్యూ చూసుకోవాలి.
- అప్లికేషన్ చేసుకున్న గరిష్టంగా 3 బ్యాంక్ పథకాలను ఎంచుకోండి. డాష్‌బోర్డ్‌లో అప్‌డేట్‌లను ట్రాక్ చేయవచ్చు.
ఆఫ్‌లైన్ విధానం
- విద్యా లక్ష్మి విద్యా రుణాల కోసం మీ సమీపంలోని బ్యాంకును సందర్శించవచ్చు.
- బ్యాంకు నుంచి విద్యా రుణ దరఖాస్తు ఫామ్ తీసుకోండి.
- అందులో వ్యక్తిగత సమాచారం, కోర్సు వివరాలు, కుటుంబ ఆదాయం, అవసరమైన రుణ మొత్తం ఇలా అన్ని వివరాలను నమోదు చేయండి.
- ఐడెంటిటీ, అడ్రస్ ఫ్రూఫ్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, అడ్మిషన్ లెటర్, ఆదాయ రుజువుతో సహా అవసరమైన అన్ని పత్రాలను అప్లికేషన్ కు జతచేయండి.
- దరఖాస్తు ఫామ్, అవసరమైన పత్రాల వెరిఫికేషన్ కోసం బ్యాంకు అధికారులను సంప్రదించండి.
- బ్యాంకు మీ అప్లికేషన్ పరిశీలించి, సర్టిఫికెట్లను వెరిఫై చేస్తుంది.
- ధృవీకరణ తర్వాత, బ్యాంకు మీ అప్లికేషన్ స్టేటస్ ను అప్‌డేట్ చేసి, రుణం మంజూరు ప్రక్రియను ప్రారంభిస్తుంది.
