MeghasandesamSerial Today Episode: శాదర, పూరి గుడికి వెళ్తారు. అక్కడ గగన్‌ పెళ్లి గురించి భూమి గురించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. మన ఇంట్లో లేకపోయినా భూమి నా పెళ్లికి అడ్డుపడుతుంది.  భూమికి బుద్ది ఎప్పుడొస్తుందో ఏంటో అని తిడుతుంది పూరి.

Continues below advertisement

శారద: పెళ్లి అన్నా తాళి అన్నా ఏ ఆడదానికైనా ఒక్కటే పూరి. కాబట్టి నీ మెడలో తాళి పడటం కోసం తన మెడలో తాళి తీసేయాలి అని మాత్రం అనుకోకు

పూరి: అంతేలే నీకు ఎప్పటికీ నీ కోడలే ముఖ్యం. కూతురు అక్కర్లేదు కదమ్మా..? నాకు నా అన్నయ్య ఉన్నాడులే

Continues below advertisement

శారద: పూరి నువ్వు గగన్‌ నాకు రెండు కళ్లు అయితే భూమి నా మనఃసాక్షికి ప్రతిరూపం. తనలో నన్ను నేను చూసుకుంటాను.

పూరి: అందుకే నిన్ను బాగా గ్రిప్పులో పెట్టుకుంది.

శారద: నేను ఇక్కడికి వచ్చింది ఆ దేవుడి దయ వల్ల అయినా వాళ్లిద్దరూ కలవాలని కోరుకోవడానికి. నువ్వు అనవసరమైన వాదన పెట్టకు.

పూరి: నేను మాత్రం వాళ్లిద్దరూ ఎన్నటికీ కలవకూడదనే కోరుకోవడానికి వచ్చాను.

శారద: పూరి…

పూరి: అన్నయ్యకు అది అక్కర్లేదు అమ్మ.. తార ఫర్పెక్ట్ మ్యాచ్‌. నా జీవితంలో నిప్పులు పోసిన ఆ భూమి మళ్లీ మన ఇంట్లో కాలు కూడా పెట్టకూడదు. అన్నయ్య జీవితంలోకి పిడుగులు రాకూడదమ్మ

శారద: చూడు పూరి.. పూరి..

అంటుంటే పూరి దేవుడికి మొక్కి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

శారద: భగవంతుడా మేము ఉన్నదే నలుగురం. మాలో మాకు ఈ విభేదాలు ఏంటి..? ఈ గొడవలు ఏంటి..? ఇప్పటిదాకా వదిన అంటే ప్రాణంగా చూసుకునే పూరి కూడా తన పేరు ప్రస్తావిస్తేనే భగ్గుమంటుంది. ఈ గండాలు అన్ని దాటి నా కొడుకు కోడలు ఒక్కటైయ్యేలా దారి చూపించు స్వామి.

అని మొక్కుకుంటుంటే.. బయటకు వెళ్లిన పూరికి శివ, బిందు ఎదురుగా వస్తుంటారు. వాళ్లను చూసిన పూరి కోపంతో ఊగిపోతుంది.

బిందు: బాగున్నావా..? పూరి

పూరి: సూపర్‌గా ఉన్నాను. పెళ్లి ఆగిపోయినా నాకు సిగ్గు లేదు కదా..? ఫెంటాస్టిక్‌ గా ఉన్నాను. ఏమో నీకు ఈ ప్రపంచంలో మగాడే దొరకలేదా..? నేను ప్రేమించినోడు.. నన్ను పెళ్లి చేసుకుంటానన్నోడే దొరికాడా..? నువ్వు మాత్రం ఏం తక్కువ నన్ను ప్రేమించానని అబద్దం చెప్పి దాని మెడలో తాళి కట్టావు.. మీరిద్దరు పెళ్లి చేసుకుని నన్ను పిచ్చి దాన్ని చేశారు. నాకు జీవితమే లేకుండా చేశారు. నా భవిష్యత్తును శూన్యం చేసి మీరు మాత్రం సుఖఃసంతోషాలతో మ్యారీడ్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దాం అనుకుంటున్నారా..? అది ఎప్పటికీ జరగదు. ఇదే నా శాపం

 అంటఊ వెళ్లి పక్కనే ఉన్న బూడిద తీసుకొచ్చి శివ, బిందుల మీద కొడుతుంది.

బిందు: పూరి ఏం చేశావు నువ్వు..

శివ: ఎంత కోపం ఉంటే మరీ ఇలా చేస్తావా..?

పూరి: మీరందరూ ఒకటై నన్ను ఒంటరిదాన్ని చేశారు. దేవుడు అన్ని చూస్తున్నాడు. మీరిద్దరూ ఎలా హ్యాపీగా ఉంటారో నేను చూస్తాను. రేపు మీ బతుకులు కూడా కాలి బూడిదై పోతాయి.

అంటూ పూరి కోపంగా తిడుతుంది. శివ, బిందులు బాధగా చూస్తుంటారు.  ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.    

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!