PM Modi Warangal Visit: తెలంగాణ పుట్టుకనే అవమానించిన దుర్మార్గపు ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యనను తాము బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తల్లిని చంపి బిడ్డను వేరి చేసినట్లు.. తెలంగాణను ఏపీ నుంచి వేరు చేశారని నాడు ప్రధాని చేసిన కామెంట్లను గుర్తు చేశారు. ఏ మొహం పెట్టుకొని ప్రధాని తెలంగాణకు వస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లతో కలిసి మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈక్రమంలోనే ఆయన ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. విభజన హామీల్లో ప్రధాని మోదీ ఒక్కటి కూడా నెరవేర్చలని చెప్పుకొచ్చారు. గుజరాత్ కు రూ.20 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారని.. తెలంగాణకు కేవలం 521 కోట్ల నిధులు ఇవ్వడం ఏంటని అడిగారు. తెలంగాణ పట్ల ప్రధాని మొసలి కన్నీరు కారుస్తున్నారని.. కానీ ఈ రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కాదని చెప్పారు. రేపటి(శనివారం) ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. 







అంతేకాకుండా గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ప్యాక్టరీ హామీ ఏమైందని ప్రధాని మోదీని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. బీజేపీని, ప్రధాని మోదీని ఎందుకు విమర్శించరని ప్రశ్నించారు. గాంధీ భవన్ లో గాడ్సే దూరాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆర్ఎస్ఎస్ వ్యక్తి అంటూ ఆరోపించారు. భూ దందాలు చేసే వ్యక్తులే ధరణిని వద్దంటున్నారని విమర్శించారు. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసే పని చేస్తున్నాయని చెప్పారు. ఆ పార్టీల మోసాలు అన్నీ తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. సీఎం కేసీఆర్ పోరాట పటిమ గురించి అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలుసున్నారు. అందుకే ఏ రాష్ట్రానికి వెళ్లినా బీఆర్ఎస్ కు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పాలనులో ఏదైనా జరిగిందంటే నిరుద్యోగం, అప్పులు మాత్రమేనని ఎద్దేవా చేశఆరు. రాహుల్ గాంధీ అడ్డగోలు ఆరోపణలను ప్రజలు పట్టించుకోవడం లేదని చెప్పారు. ఏ అర్హతతో రాహుల్ గాంధీ తమపై ఆరోపణలు చేస్తున్నారో చెప్పాలని అన్నారు. 






అలాగే ఇటీవలే కుసుమ జగదీష్, సాయిచంద్ హఠాన్మరణాలు తనను ఎంతగానో బాధించాయన్నారు. వీరిద్దరి మరణం పార్టీకి తీరని లోటు అని చెప్పుకొచ్చారు. ఇద్దరి మృతితో సీఎం కేసీఆర్ కూడా కలత చెందారని వివరించారు. సాయిచంద్ , కుసుమ జగదీష్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల తరపున రూ. 1 కోటి 50 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు.