PM Internship Scheme 2026: పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ ద్వారా దేశంలోని టాప్ 500 కంపెనీలలో యువతకు వేతనంతో కూడిన ఇంటర్న్‌షిప్‌లను అందిస్తుంది. ఈ పథకం కింద విద్యార్థులు స్కిల్స్ నేర్చుకోవడంతో పాటు  నెలకు రూ.5,000 స్టైపెండ్,  రూ.6,000 వన్ టైమ్ గ్రాంటును ఒక సంవత్సరం పాటు అందిస్తారు. పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని 2024లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలలో రెండు విడతలుగా అమలు చేశారు. మొత్తంగా 1.10 లక్షల ఇంటర్న్‌షిప్ లు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్టును డిసెంబర్ 2026 వరకు పొడిగించారు. ఇంటర్న్‌షిప్ కాల పరిమితి ఆయా సంస్థల అవసరాలను బట్టి 6 లేదా 9 నెలలు ఉంటుంది. ఇప్పటికే ఉన్న వారికి 12 నెలల ఇంటర్న్ షిప్ అందిస్తున్నారు. కొన్ని సంస్థలు ఇంటర్న్‌లకు నెలకు రూ.9,000 వేతనం అందిస్తున్నాయి. 

Continues below advertisement

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2026 దరఖాస్తు విధానం 

1. అధికారిక వెబ్‌సైట్‌ https://pminternship.mca.gov.in/login/  ను సందర్శించండి. 2. హోమ్‌పేజీలో 'టాప్ కంపెనీల ఇంటర్న్‌షిప్‌లు' కోసం సెర్చ్ చేయండి.  3. ఏదైనా కంపెనీ లోగోపై క్లిక్ చేయండి.4. ఆ కంపెనీ అందిస్తున్న ఇంటర్న్‌షిప్‌లు స్క్రీన్ పై కనిపిస్తాయి. 5. హోమ్‌పేజీలోని లాగిన్/రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేయండి.6. మీ యూజర్‌నేమ్/మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, లాగిన్‌పై క్లిక్ చేయండి.7. మీరు ఎంచుకున్న ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి. 

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ కొత్త దరఖాస్తులు

ప్రస్తుతం 21,700కు పైగా ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు pminternship.mca.gov.in అధికారిక పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఐటీ, హెల్త్ సెక్టార్, రిటైల్, లాజిస్టిక్స్, తయారీ, హాస్పిటాలిటీతో సహా 20కి పైగా రంగాలలో ఇంటర్న్ షిప్ లు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 380కి పైగా జిల్లాలలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.  

Continues below advertisement

దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు?

18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారుఎస్ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, BA, BSC, B.Com, BCA, BBA, B.Pharma, B.E, B.Tech చేసిన అభ్యర్థులు లేదా ఎంఏ, ఎంఎస్సీ, ఎం.కామ్, ఎంసీఏ, ఎం.టెక్ డిగ్రీలు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్లు   నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) లేదా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) కింద ఇప్పటికే అప్రెంటిస్‌షిప్ పూర్తి చేయాలి. కుటుంబ సభ్యులలో ఎవరి ఆదాయం అయినా రూ.8 లక్షలకు మించి ఉండకూడదు. 

Also Read: 

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2026 ఎంతకాలం?

పీఎం ఇంటర్న్‌షిప్ ఎంత కాలం అనేది ఇంటర్న్‌షిప్ అందిస్తున్న కంపెనీ అవసరాన్ని బట్టి ఉంటుంది. సాధారణంగా 6 లేదా 9 నెలలు ఉంటుంది. ఇంటర్న్‌షిప్ లో ఎక్కువ సమయం వర్క్ ఫీల్డ్ లో ఉంటారు.   

అవసరమయ్యే డాక్యుమెంట్స్ 

  • ఆధార్ కార్డు
  • వయస్సు ధ్రువీకరణ పత్రం
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు  
  • ఆధార్‌తో లింక్ చేసిన బ్యాంకు అకౌంట్ 
  • ఇతర ముఖ్యమైన పత్రాలు