Padi Kaushik Reddy is targeting Minister Ponnam Prabhakar   :   ఒకప్పుడు బూడిదే కదా అని ఎవరు పట్టించుకోలేదు. ఆ తరువాత బూడిదకు మార్కెట్లో డిమాండ్ పెరగడంతో...రాజకీయ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో ఎవరు అధికారంలో ఉంటే వారు బూడిద దందాలో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బూడిద రవాణ రాజకీయం దుమారం రేపుతుంది.  కాంగ్రెస్,బిఆర్ఎస్ నేతల మధ్య పోలిటికల్ వార్ కు కేరాప్ అవుతుంది బూడిద దందా. మంత్రికి బూడిద అక్రమ రవాణాతో సంబందం ఉందని ఎమ్మెల్యే ఆరోపిస్తుంటే...ఎమ్మెల్యే ఆరోపణల పై మంత్రి  అనుచరులుర్స్ మండి పడుతున్నారు.


బూడిత రవణాలో అక్రమాలని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు 


బూడిద రవాణలో అక్రమాలంటు కాంగ్రెస్,బిఆర్ఎస్ మధ్య వార్ జరుగుతుంది. మంత్రి పోన్నం ప్రభాకర్ అండదండాలతోనే అక్రమ రవాణా జరుగుతుంది అని అంటున్న ఎమ్మెల్యే  కౌశిక్. కొన్నాళ్ల కిందటి వరకూ బూడిదే కదా అని ఎవరు పట్టించుకోలేదు. ప్రీగా ఇస్తాం తీసుకెళ్లండి అంటు ఎన్టీపిసి ఆఫర్ ఇచ్చినప్పటికి లోడ్ చేసుకునే వారే కరువయ్యారు. అయితే దశాబ్ద కాలం తరువాత మార్కెట్లో బూడిదకు డిమాండ్ పెరిగింది. దీంతో ప్రీగా ఇస్తామన్న బూడిదకు ఇప్పుడు టెండర్ పిలుస్తున్నారు. రోజు వందల లారీలు ఎన్టీపిసి యాష్ ఫండ్ నుంచి బూడిదను తరలిస్తున్నాయి. అయితే బూడిదకు పెరిగిన డిమాండ్ తో రాజకీయ నాయకులు దందాలో  ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల కనుసన్నల్లోనే బూడిద రవాణా జరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు అధికార పార్టీ నేతల జోక్యంతో అక్రమ రవాణ,ఓవర్ లోడ్ తో బూడిద తరలిపోతుంటే చోద్యం చూస్తున్నారా అంటు ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు.


రోడ్లు, బ్రిక్స్ నిర్మాణంలో బూడిద వినియోగం
 


పెద్దపల్లి జిల్లా అంతర్గామ్ మండలంలోని కుందన పల్లి చెరువు నుంచి ఇతర ప్రాంతాలకు కోన్నెళ్లుగా బూడిదను తరలిస్తున్నారు. బోగ్గు ఆధారిత  రామగుండం ఎన్టీపిసి నుంచి వెలువడే తడి, పోడి బూడిదను కుందన పల్లి చెరువులో నింపుతుంటారు.  5 వందల ఎకరాల్లో ఉన్న యాష్ ఫాండ్ లో రోజు టన్నుల కోద్ది బూడిదను డంప్ చేస్తారు.  ఇక్కడి బూడిదను రోడ్ల నిర్మాణానికి,ఇటుకల తయారీకి ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే బూడిద రవాణ చేసుకోవడానికి ఎన్టీపిసి కొన్ని ఏజెన్సిలకు అనుమతించగా...ఓవర్ లోడ్ లారీలు వెళ్ళడం వివాదాస్సదంగా మారింది.  గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం తరలిస్తున్న బూడిద  లారీలు ఓవర్ లోడ్ తో వెళ్తున్నాయంటt హుజురాబాద్ ఎమ్మెల్యే వాటిని అడ్డుకోని ఆందోళనకు దిగారు.  రోజుకు మూడు వందల కు పైగా లారీలు ఓవర్ లోడ్ తో వెళ్తున్నాయని... ఈ వ్యవహరంతో మంత్రి పోన్నం ప్రభాకర్ కు సంబందం ఉందని... 50 లక్షల మంత్రికి ముడుతున్నానంటూ ఆరోపించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.


లీగల్ నోటీసులు పంపిన పొన్నం 


ఇక ఇదే విషయంపై ఇటీవల కాలంలో హుజురాబాద్ నియోజకవర్గం లోని వీణవంక మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి . ఎన్టిపిసి ఫ్లై యాష్ విషయంలో తనకేమీ సంబంధం లేదంటే ఆలయంలోకి వచ్చి భగవంతుడిపై ప్రమాణం చేయాలంటూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు. ఇక నియోజకవర్గంలో ఓవైపు కాంగ్రెస్ మరోవైపు టిఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ ఏర్పడే పరిస్థితి వచ్చింది పోలీసులు తాత్కాలికంగా పరిస్థితిని సద్దుమణిగించారు.  మంత్రి పోన్నం ప్రభాకర్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదంటు హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. బూడిద రవాణాకు మంత్రికి సంబంధం లేదనేది కాంగ్రెస్ నాయకులు వాదన.బూడిద రవాణ వ్యవహరంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విభాగాలే నిబంధనలు అతిక్రమిస్తున్న విషయాన్ని కాంగ్రెస్,బిఆర్ఎస్ నాయకులు పట్టించుకోవడం  లేదన్నట్లుగా తెలుస్తుంది.  రవాణ శాఖ రూల్స్ బ్రేక్ చేస్తున్నారనే విషయాన్ని పట్టించుకోకుండా పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్టీపిసి బూడిద మాత్రం రాజకీయ చిచ్చు రేపుతుంది.