India Strikes in Pakistan |  జమ్మూకాశ్మీర్ పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి భారత త్రివిద దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్తాన్, పీఓకేలోని జేషే ఈ మహ్మద్, లష్కరే తోయిబా గ్రూపులకు చెందిన 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. భారత బలగాలు విజయవంతంగా లక్ష్యాన్ని పూర్తి చేశారని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ అర్ధరాత్రి కీలక ప్రకటన చేసింది. భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురిపిస్తున్నాయి. దటీజ్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్, దటీజ్ పీఎం మోదీ అని కితాబిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం జరిగింది. జై హింద్ అని ఇండియన్ ఆర్మీ అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆయన సైతం భారత్ చేపట్టిన ఆపరేషన్ కు మద్దతు తెలుపుతూ జై హింద్ అని రీట్వీట్ చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే..

ఆపరేషన్ సిందూర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఒక భారతీయ పౌరుడిగా, మన సాయుధ దళాలకు మద్దతు తెలుపుతున్నాను. పాకిస్తాన్,  పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు దాడులు దేశం మొత్తాన్ని గర్వపడేలా చేశాయి. దీనిని దేశవ్యాప్తంగా సంఘీభావం తెలిపేందకు అందరూ ఏకం కావాలి. ఈ విషయంపై మనమందరం ఒకే గొంతకగా మాట్లాడుదాం - జై హింద్! అని రేవంత్ రెడ్డి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.