NTR Centenary Celebrations Live Updates: ఎన్టీఆర్ కు కచ్చితంగా భారతరత్న ఇవ్వాల్సిందే - నారాయణమూర్తి

NTR Centenary Celebrations Live updates: ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకొని ‘ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ’ కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని కైతలాపూర్‌ లో వేడుకలు మొదలయ్యాయి.

ABP Desam Last Updated: 20 May 2023 10:23 PM

Background

NTR Centenary Celebrations Live updates:విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, దివంగత నేత ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకొని ‘ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ’ మే 20న సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులోని కైతలాపూర్‌ మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వేడుకలు...More

NTR Centenary Celebrations: ఏ నేతకు సాధ్యంకాని పథకాలు ప్రవేశపెట్టారు ఎన్టీఆర్ - బాలకృష్ణ

తన తండ్రి ఎన్టీఆర్ కారణజన్ముడు, తనకు గురువు, దైవం అన్నారు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. అందర్నీ మహానుభావులు అనరు. అలా అనిపించుకోవాలంటే మహోన్నత భావాలు ఉండాలి, మహోన్నత ఆచరణ చేసిన వాళ్లే మహానుభావులు అవుతారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిల్చున్న వ్యక్తి ఎన్టీఆర్. ఏ నేతకు సాధ్యంకాని పథకాలను ఆయన ప్రవేశపెట్టారు. ఎన్నో గొప్ప పాత్రలు ఆయన పోషించారని గుర్తుచేశారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా జీవించారని తన తండ్రి ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు.


ఎన్టీఆర్ అందరికీ ఆదర్శం. వందేళ్ల కిందట ఓ వెలుగు వెలిగింది. ఆ వెలుగు మరో వెయ్యేళ్లకు సరిపడ కాంతినిచ్చింది. ఆయన పేరు తలుచుకుంటే తెలుగు జాతి ఒళ్లు పులకరిస్తుంది. ఇతను మా వాడు అని తెలుగు ప్రజలు చెప్పుకునే మనిషి ఎన్టీఆర్. తన జన్మను తెలుగుజాతికి ఓ బ్రహ్మోత్సవంలా మార్చేశారు. తెలుగోడు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా గుర్తొచ్చేది ఎన్టీఆర్. ఆయన నుంచి ఎంతో మంది స్ఫూర్తి పొందుతారన్నారు. నటనకు నిర్వచనం, నవరసాలకు నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నూతన శకానికి నాంది.