KTR Formula E race case: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 28వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. గతంలో ఓ సారి ఏసీబీ ఈ కేసు అంశంలో ప్రశ్నించింది. అప్పట్లోనే మరోసారి పిలుస్తారని ప్రచారం జరిగింది కానీ ఎలాంటి నోటీసులు రాలేదు. కానీ హఠాత్తుగా ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసింది. పెద్దగా సమయం కూడా ఇవ్వకుండా.. రెండు రోజుల్లోనే తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించడం హాట్ టాపిక్ గా మారింది.
నోటీసులపై కేటీఆర్ సోషల్ మీడియాలో స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ, నేను ఖచ్చితంగా ఏజెన్సీలతో సహకరిస్తానననిప్రకటించారు. చాలా ముందుగానే పార్టీ కార్యక్రమాల కోసం UK & USAకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నానని తెలిపారు. నేను తిరిగి వచ్చిన క్షణంలో వారి ముందు హాజరవుతాను. ACB అధికారులకు అదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాననని ప్రకటించారు. కానీ రాజకీయ ప్రతీకార దాహానికి మరియు దానిని సాధించడానికి అతను ఎటువంటి సంకోచం లేకుండా ఏ దిశలోనైనా ఊగుతున్న తీరుకు నేను రేవంత్ రెడ్డిని అభినందించాలని ఎద్దేవా చేశారు.
48 గంటల క్రితం, నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బు సరఫరా చేసినందుకు ED ఛార్జిషీట్‌లో రేవంత్ రెడ్డి పేరు ఉందని. 24 గంటల తర్వాత రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో సహా బిజెపి అగ్ర నాయకులతో గొడవ పడుతున్నట్లు కనిపిస్తోంది.. కానీ మనీలాండరింగ్ కేసులో ప్రమేయం ఉన్నందుకు ఒక్క బిజెపి నాయకుడు కూడా రేవంత్ రెడ్డిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ఈరోజు, నాకు ACB నుండి నోటీసు వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నాయకుడిగా మరియు మానవుడిగా కూడా విఫలం కావచ్చు కానీ చౌకబారు ప్రతీకార రాజకీయాల్లో తనను తాను నిరూపించుకుంటున్నాడని మండిపడ్డారు.
కేటీఆర్ ట్వీట్ ప్రకారం ఇరవై ఎనిమిదోతేదీన ఆయన విచారణకు హాజరు కావడం లేదని అర్థం చేసుకోవచ్చు. అయితే ఏసీబీ ఎలా స్పందిస్తుందన్నది కీలకంగా మారింది.