Mancherial News | బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నీల్వాయి గ్రామంలోఏట మధుకర్ కుటుంబాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. బీజేపీ పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మధుకర్ కుటుంబానికి అండగా నిలవడంతో పాటు బీజేపీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుల వేధింపులతో ఏట మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు 

Continues below advertisement

 బండి సంజయ్ మాట్లాడుతూ.. ఏట మధుకర్ ఆత్మహత్య బాధాకరం బిజెపి పార్టీ తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మృతుని కుటుంబానికి భరోసా కల్పించాలని అండగా ఉంటామన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయ హత్యగా భావిస్తున్నాం. బిజెపి పార్టీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్ళు కాదు. నమ్మిన సిద్ధాంతం కోసం పేదరికాన్ని సైతం లెక్కచేయకుండా బిజెపి పార్టీ కోసం జెండా కోసం మధుకర్ పనిచేశాడన్నారు.

Continues below advertisement

గతంలో టిఆర్ఎస్, నేడు కాంగ్రెస్ అరాచకాలునమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇలాంటి అరాచక చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్ట అధికారంలో ఉండగా అరాచకాలు చేసింది. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేసులకు లాఠీ ఛార్జీ లకు భయపడలేదు.  నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నమ్మి ఓటేస్తే వాళ్ళు దౌర్జన్యాలకు ప్రజలు బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజే సౌండ్ లకు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ పోలీసులు మధుకర్ పైన అట్రాసిటీ కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేశారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుంది. 

బిజెపి పాలిత  రాష్ట్రాల్లో గుండా గిరి,  రౌడీయిజం చేసే.. ప్రజల మాన ప్రాణ, ఆస్తులను దోచుకునే రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరిస్తున్నాము. ప్రతి బిజెపి కార్యకర్త కుటుంబానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. 48 గంటల్లో వారిని అరెస్టు చేయాలని, వేధింపులకు గురి చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పోలీసులు,  కాంగ్రెస్ నాయకులు కలిసి రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. బీజేపీ తరఫున వారికి తగిన బుద్ధి చెబుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. 

మంచిర్యాల, బెల్లంపల్లిలో బీజేపీ నేత మధుకర్ మృతి పట్ల నిరసనలు

మంచిర్యాల జిల్లా వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షులు ఏటా మధుకర్ ఆత్మహత్యకు కారకులు అయిన కాంగ్రెస్ నాయకులను మరియు అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం భారతీయ జనతా పార్టీ ఆద్వర్యంలో మంచిర్యాల, మరియు బెల్లంపల్లిలో నిరసన చేపట్టారు. మంచిర్యాల పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏటా మధుకర్ మృతికి కారకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను మరియు వారి ఒత్తిడి లకు తలొగ్గి అక్రమంగా కేసు నమోదు చేసిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. తాను చేయని తప్పుకు అక్రమంగా తనపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దాడులు మరియు అక్రమ కేసులు ప్రతిపక్ష పార్టీలపై నమోదు చేయడం జరుగుతుందని ప్రజలన్నీ గమనిస్తున్నారని అన్నారు. ఏటా మధుకర్ మృతికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వహించి వారి కుటుంబానికి అండగా నిలిచి వారి ఆత్మహత్యకు కారకు లైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను తక్షణమే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. 

పాడే మోసిన సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు

మంచిర్యాల జిల్లా వేమనపెల్లి మండలంలోని నీల్వాయి గ్రామంలో శనివారం మధుకర్ అంతక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. మాధూకర్ స్వగృహనికి సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు, మరియు మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్ రావు, జిల్లా బిజెపి నాయకులు చేరుకొని ఆయన పార్థివ దేహానికి బిజెపి జెండా కప్పి, పూలమాలతో నివాళులర్పించారు. మృతిని కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అనంతరం మధుకర్ అంతిమయాత్రలో సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, మాజీ ఎంపీ వెంకటేశ్ నేత పాల్గొని పాడే మోశారు. గ్రామంలో ఎలాంటి ఆందోళనలు చోటు చేసుకోకుండా నీల్వాయి గ్రామంలో పోలీసులు పెద్దఎత్తున మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.