తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాల బాగోతం పూర్తిగా సద్దుమనగక ముందే తాజాగా సౌత్ క్యాంపస్ లో అక్రమ నియామకాల అంశం వివాదాస్పదంగా మారింది. అక్రమంగా టీచింగ్ నియామకాలు చేపట్టారని యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి గణేష్ తీసిన సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. సౌత్ క్యాంపస్‌లో అక్రమ నియామకాలు జరిగాయంటూ వీడియో ద్వారా ఆరోపించాడు. పార్ట్ టైం టీచింగ్ నియామకం ఫిజిక్స్ డిపార్ట్ మెంట్లో 2019 ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ ఇచ్చారు. ఆరుగురు దరఖాస్తు చేస్తుకున్నారు.
సౌత్ క్యాంపస్ లోనే పార్ట్ టైంలో 2 ఏళ్లుగా టీచింగ్ చేసిన తనతోపాటు మరోక ఫిజిక్స్ రీసెర్చ్ స్కాలర్ దేవయ్యకు ఇంటర్వూ ఉన్నట్లు సమాచారం కూడా ఇవ్వలేదని గణేెష్ పేర్కొన్నాడు. అప్పటి వీసీ సాంబయ్య తనకు నచ్చిన వ్యక్తులకు అక్రమంగా పోస్టింగ్ ఇచ్చారని గణేష్ ఆరోపించారు. ఈ నియామకాలను పార్ట్ టైం టీచర్లుగా నియమించారు. కానీ వారిని కాంట్రాక్ట్ ప్రోఫెసర్లుగా అప్పటి వీసీ సాంబయ్య పి, సరిత, దిలీప్, శ్రీమాతను నియించారని తెలిపారు గణేష్.
Also Read: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
నియామకాలకు వ్యతిరేకంగా హైకోర్టుకెళ్లిన గణేష్
ఈ నియామకానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు గణేష్ తెలిపాడు. వీసీ, రిజిస్ట్రార్లకు నోటీసులు కూడా పంపినట్లు వెల్లడించాడు. కానీ వారు ఆ నోటీసులకు ఇప్పటి వరకు సమాధానం రాలేదని.. యూనివర్సిటీ అక్రమ నియామకాలు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఆందోళన చేస్తే అక్టోబర్ 31న ఈసీ పాలక మండలి సమావేశంలో ఈ నియామకాలు రద్దు చేశారని గుర్తుచేశాడు.
వీసీ, రిజీస్ట్రార్లు కలిసి పి. సరిత, దిలీప్, శ్రీమాతను కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా కొనసాగమని చెప్పడం, బడ్జెట్ కేటాయించడం సిగ్గుచేటని గణేష్ అన్నాడు. ఈ నియామకాలు యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమని ఇకనైనా అక్రమ నియామకాలను రద్దు చేసి వెంటనే డిపార్ట్ మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. దానివల్ల ఎంతో మంది అర్హత కలిగిన నిరుద్యోగులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నాడు. యూజీసీ నిబంధనలు పాటిస్తూ మళ్లీ నియామకాలు చేపట్టాలని... దీంతో విద్యార్థుల భవిష్యత్ మెరుగుపడుతుందని చెప్పాడు.
Also Read: చీరకట్టుతో కనికట్టు చేస్తోన్న అతిలోక సుందరి తనయ
Also Read: Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !