టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడతాయని, ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యమంలో పోరాటం చేశారు. లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమంలో పాల్గొన్నారని, 1200 మంది బలిదానం చేశారని గుర్తుచేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో ప్రజల మీద ప్రభావం చూపేలా సీఎం కేసీఆర్ ప్రసంగాలు చేశారని అన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సీఎం అయ్యాక మొదటిసారి శాసన సభ ప్రసంగంలో  వివిధ శాఖల్లో లక్షా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. 9 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ ఊసే లేదున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు సీఎం కేసీఆర్ వల్లే జరిగాయని అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికీ ప్రశ్న పత్రం లీక్ పై సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వలేక పోయారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. 


రాజకీయ పునరావాస కేంద్రంగా టీఎస్ పీఎస్సీ
తెలంగాణలో ప్రభుత్వం నిరుద్యోగ యువకులతో చెలగాటం ఆడుతొంది. రాష్ట్ర పబ్లిక్ కమిషన్ ను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని అన్నారు. గతేడాది గ్రూప్ 1 పరీక్షల్లో 2 లక్షల 85 వేల మంది పరీక్షలు రాశారు. ఈ పరీక్షల్లో కూడా అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ వచ్చాక నిర్వహించిన పరీక్షల్లో ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నాయి. 9 ఏళ్లలో నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా ఏ పరీక్షలు నిర్వహించలేదని అన్నారు. ఇంటర్మీడియట్ లో ప్రశ్నపత్రాలు సరిగ్గా దిద్దక 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 
సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణకు డిమాండ్ 
ప్రస్తుతం ప్రవీణ్ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ప్రశ్నపత్రం కీ ఎలా దొరికింది. అతనికి 150 మార్కులకు 103 మార్కులు ఎలా వస్తాయని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఉనికి లోప భూయిష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వంలోని పెద్దలే గుడుపుటాని చేసి పరీక్ష పత్రం లీక్ చేశారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. సింగరేణి లో నిర్వహించిన పరీక్షల్లో కూడా టీఆరెస్ ఎమ్మెల్యేలు, కేటీఆర్ కు ప్రమేయం ఉందని అన్నారు రేవంత్. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చేలాగాట మారుతున్నారు సీఎం కేసీఆర్.  సీఎంగా కేసీఆర్ బాధ్యత తీసుకున్న తర్వాత జరిగిన ఉద్యోగ పరీక్షల మీద సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు రేవంత్ రెడ్డి.


పేపర్ లీక్ మీద సరైన వివరణ ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ లీక్ పైన ప్రభుత్వం ఫిర్యాదు కూడా చేయలేదు. ఎందుకంటే పెద్దల బాగోతం బయటపడుతుందని అన్నారు. ఫిర్యాదు చేయకున్నా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకోవాలని అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గందరగోళానికి కారణం ప్రవీణ్. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ భర్తీ చేసే పబ్లిక్ కమిషన్ కార్యాలయంలో 400 మంది సిబ్బందికి కేవలం 80 మంది మాత్రమే అందులో పనిచేస్తున్నారు. 
ఈ 80 మందిలో 50 మంది డ్రైవర్లు, స్వీపర్లు ఉన్నారంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఎలా ఉందో... టౌన్ ప్లానింగ్, గ్రూప్ వన్ పరీక్షలతో పాటు ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల  మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు ఎలా లీక్ అయ్యాయి, ఎవరు లీక్ చేశారు అన్నదాని పై విచారణ జరిపించాలి. గవర్నర్ కూడా ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.