KTR in Mancherial: 
తెలంగాణ పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనపై మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఉందనీ, మంత్రి పర్యటనను బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులు విజయవంతం చేయాలని పిలుపనిచ్చారు. మంచిర్యాల జిల్లాలోనీ మందమర్రి, క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 312.96 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారన్నారు. 


ముందుగా మందమర్రి సమీపంలోని 72 ఎకరాల్లో 500 కోట్ల రూపాయలతో అయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. అనంతరం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణాలు పూర్తి అయిన 286 డబుల్ బెడ్ రూమ్స్ ను ప్రజలకు పంపిణీ చేస్తారు. హైదరాబాద్ తరహాలో కేటీఆర్ అర్బన్ పార్కుల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఆపై 2 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన సమ్మక్క- సారలమ్మ మహిళ భవన్ ను ప్రారంభిస్తారు. ఇక త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల పంపిణీ, ఇళ్ళ నిర్మాణం కోసం గృహ లక్ష్మి పథకం ద్వారా 3 లక్షల రూపాయలను అందిస్తాం అన్నారు. 


ఈ పర్యటనలో భాగంగా మందమర్రి పట్టణంలో మినిస్టర్ కేటీఆర్ రోడ్ షోలో సైతం పాల్గొంటారని బాల్క సుమన్ తెలిపారు. పలు జిల్లాల్లో అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు చేస్తున్నారని ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాకు కేటీర్ అక్టోబర్ 1న రానున్నారని చెప్పారు. కేటీఆర్ పర్యటనలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాల్క సుమన్ తో పాటు పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత, ఎమ్మేల్యే దివాకర్ రావు, మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


 


ఆదివారం కేటీఆర్ పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, టాగూర్ స్టేడియం లో జరుగు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. చుట్టుపక్కల ప్రజలు సమావేశంలో పాల్గొనటానికి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తే సమస్యలు తలెత్తుతాయి. కనుక వాహనాల పార్కింగ్ కోసం ఈ క్రింది స్థలాలను గుర్తించారు పోలీసులు


1. జైపూర్, భీమారం నుండి వచ్చే బస్ లు, విద్యా నగర్ దగ్గర, ప్రజలని దింపి, RK-4 గడ్డ దగ్గర యంగ్ స్టార్స్ గ్రౌండ్ లో పార్క్ చేసుకోవాలి.
Parking Place co-ordinates: 
http://maps.google.com/maps?q=18.928271,79.482438


2. చెన్నూర్ రూరల్ మరియు చెన్నూర్ టౌన్ నుండి వచ్చే బస్ లు రాజీవ్ చౌక్ దగ్గర ప్రజలని దింపి, అమరవాది రోడ్ కు గల పార్కింగ్ ప్లేస్ లో బస్ లని పార్క్ చేసుకోవాలి.
Parking Place co-ordinates: 
http://maps.google.com/maps?q=18.924306,79.474965


3. మందమర్రి రూరల్, మందమర్రి టౌన్ నుండి వచ్చే బస్ లు ఆదివారం సంత దగ్గర ప్రజలని దింపి, అక్కడే వెహికల్స్ పార్క్ చేసుకోవాలి.
Parking Place co-ordinates:
 http://maps.google.com/maps?q=18.938434,79.473140



4. కోటపల్లి మండలం నుండి వచ్చే బస్ లు RK-4 గడ్డ దగ్గర, పార్క్ చేసుకుని, కోల్ రోడ్ కి ఒక వైపు వాహనాలు పార్క్ చేసుకోవాలి.
Parking Place co-ordinates: 
http://maps.google.com/maps?q=18.928271,79.482438


5. మీటింగ్ కి వచ్చే కార్ లు రాజీవ్ చౌక్ దగ్గర,  CV రామన్ స్కూల్లో పార్కింగ్ చేసుకోవాలి. 
Parking place Co-ordinates:
http://maps.google.com/maps?q=18.9275599,79.4750749


కావున అందరూ గమనించి తమ తమ వాహనాలను ఆ ప్రదేశాలలో పార్క్ చేసుకొని పోలీస్ వారికి సహకరిస్తూ టాగూర్ స్టేడియంలోని సభాస్థలికి చేరుకోవాలని బెల్లంపల్లి డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ పంతాటి సదయ్య సూచించారు.