తెలంగాణ ఐసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్లు పొందిన వారు ఫీజు చెల్లించేందుకు, కళాశాలల్లో రిపోర్ట్‌ చేసేందుకు గడువును అక్టోబరు 6 వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం కళాశాలలో రిపోర్టింగ్ చేసే గడువు సెప్టెంబర్‌ 30తో ముగిసింది. అయితే అక్టోబరు 6 వరకు అవకాశం కల్పించారు. సీట్లు పొందినవారు సెప్టెంబరు 6 లోగా నేరుగా కళాశాలకు వెళ్లి మరోమారు ధ్రువపత్రాల పరిశీలన చేయించుకొని, సీటు కేటాయింపును నిర్దారించుకోవాల్సి ఉంటుంది.


'రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 26, 27 తేదీల్లో నిర్వహించిన 'టీఎస్ ఐసెట్‌-2023' పరీక్ష ఫలితాలు జూన్ 29న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రవేశపరీక్షలో మొత్తం 61,092 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సెప్టెంబరు 6న ఐసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబ‌రు 15న‌ సీట్లను కేటాయించారు. ఎంబీఏలో 87.33 శాతం కన్వీనర్‌ కోటా సీట్లు భర్తీకాగా, ఎంసీఏలో అన్ని సీట్లు నిండాయి. ఐసెట్‌లో 61,092 మంది ఉత్తీర్ణులుకాగా.. ధ్రువపత్రాల పరిశీలనకు కేవలం 31,552 మందే హాజరయ్యారు.


ఎంబీఏలో 24,029 సీట్లకు 20,985, ఎంసీఏలో 3,009 సీట్లకు అన్నీ భర్తీ అయ్యాయి. వాటిల్లో 902 మంది ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద సీట్లు పొందారు. మొత్తం 255 కళాశాలల్లో 80 చోట్ల అన్నీ సీట్లు నిండాయి. సీట్లు పొందిన వారు సెప్టెంబ‌రు 20వ తేదీలోపు ఫీజు చెల్లించి, 29, 30 తేదీల్లో కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలని అధికారులు సూచించారు. ఐసెట్ చివరి విడత కౌన్సెలింగ్‌కు 10,762 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 729 ఎంసీఏ, మిగిలినవి ఎంబీఏ సీట్లు. 


ALSO READ:


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, సీట్ల వివరాలు ఇలా!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, అహ్మదాబాద్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోంలో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు, వివరాలు ఇలా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల మాస్టర్ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్‌, బెంగళూరు, గాంధీనగర్‌‌లో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


'దోస్త్' స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్, మరో 6,843 మందికి విద్యార్థులకు సీట్లు
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న డిగ్రీ సీట్ల భర్తీకి నిర్వహించిన 'దోస్త్‌' స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ ద్వారా మరో 6,843 మంది సీట్లు పొందారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబ‌రు 30లోపు సంబంధిత కళాశాలలో ఆన్‌లైన్‌ సెల్ఫ్‌రిపోర్టింగ్‌ చేయాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి సూచించారు. డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 1,96,386 మంది విద్యార్లు సీట్లు పొందారని. తాజా రౌండ్‌తో కలిపి మొత్తం ప్రవేశాల సంఖ్య 2 లక్షలు దాటుతుందని ఆయన తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...