మంచిర్యాల: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, కవిత ఏ పార్టీకి ఓటేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంచిర్యాలలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేరన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీకి ఓటేయమని చెబుతున్నారని, అసలు బీఆర్ఎస్ ఏ పార్టీకి మద్దతు ఇస్తుందో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ పార్టీల రహస్య అజెండా ఏంటీ ?బీఆర్ఎస్, బీజేపీ రహస్య ఎజెండా ఏంటనీ, వీళ్ల కుట్రలు సమాజం గమనించాలని పట్టభద్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎలా గెలిచిందని, బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి పడలేదా అని సీఎం ప్రశ్నించారు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు కేంద్రం నుంచి తెచ్చింది ఏంటని, ఢిల్లీలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య ఏ ఒప్పందం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, కానీ అమలు చేయలేక చేతులు ఎత్తేశారన్నారు. తెలంగాణకు మాత్రం మోదీ రెండు ఉద్యోగాలు ఇచ్చారని స్పష్టం చేశారు. అందులో ఒకటి బండి సంజయ్ కి, రెండోది కిషన్ రెడ్డికి ఇచ్చారని అవి కేంద్ర మంత్రి పదవులంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అగ్ర నేతల ఓటు ఎవరికో..
బీఆర్ఎస్, బీజేపీ నేతల తీరుపై పట్ట భద్రులు ఓ సారి బాగా ఆలోచించాలి. మీకు అండగా ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వూటుకూరి తెలంగాణ ప్రభుత్వానికి, పట్టభద్రులకు మధ్య వారధిగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీని బలహీన పర్చే కుట్రలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో లేని బీఆర్ఏస్ పార్టీ నేతలు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితలు ఏ పట్టభద్రుల అభ్యర్థికి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్లు బీజేపీకే ఓటు వేసే అవకాశం ఉందన్నారు.
కాంగ్రెస్ ను గెలిపించవద్దని ప్రచారం చేస్తున్నారు. 11 వేల మంది టీచర్లు నియమాలు చెప్పంటింది కాంగ్రెస్ కాదా.. 55,163 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం.. నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి 2 కోట్ల బకాయి ఉన్నారు. మేము యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ స్పోర్ట్ యూనివర్సిటీ 2028 లో తెలంగాణ లో గోల్డ్ మెడల్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. నరేందర్ రెడ్డిని గెలిస్తే ఆదిలాబాద్ లో యునివర్సిటీకి అన్ని ఏర్పాట్లు చెస్తారు. రైతు రుణమాఫీ చేశాం, రైతు భరోసా ఇచ్చాం.. నేను చెప్పింది నిజమైతేనే మాకు ఓటు వేయండి.. రైతులను అందుకున్న ప్రభుత్వం మాదని అన్నారు.
10 ఏళ్లలో కులగణన ఎందుకు చేయలేదు..
ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. కోటి మంది ఆడబిడ్డల్ని కోటిశ్వరులు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.. కేసీఆర్ సర్కారు చేసిన అప్పులకు ఇంతవరకు 75 వేల కోట్ల వడ్డీ కడుతున్నాం.. హైదరాబాద్ మెట్రోకు అనుమతి రాకుండా మూసీ ప్రక్షాళనకు నిధులు రాకుండా అడ్డుకున్నది బిఆర్ఎస్, బిజేపీ పార్టీలు కాదా అని ప్రశ్నించారు. మీరు 10 ఏళ్లలో కులగణన ఎందుకు చేయలేదు, మీకోసం లెక్కలు తేల్చి నేను కొట్లాడుతున్నా, బలహీన వర్గాల లెక్కలు తప్పయితే ఆధారాలతో చూపాలన్నారు. ప్రధాని మోదీ, మందకృష్ణ మాదిగను కౌగిలించుకున్నారు. కానీ వర్గీకరణ చేయలేదనీ, మాదిగ ఉప కులాల వర్గీకరణ చేసి చట్టసభల్లో ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుచేశారు. కనుక గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడితే.. కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్తం.. ఆదిలాబాద్ ను ప్రత్యేక జిల్లాగా అభివృద్ధి చేస్తామని రేవంత్ పేర్కొన్నారు.