Komaram Bheem Asifabad district : సిర్పూర్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (టి) అటవీ శాఖ కార్యాలయం ముందు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. సిర్పూర్ నియోజకవర్గంలో రైతులపై అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అటవీశాఖ సిబ్బంది పై మంత్రి కొండ సురేఖను గత రెండు రోజుల కిందట కలిసి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా సిసిఎఫ్ అధికారికి సైతం చెప్పిన అధికారుల్లో చలనం లేకపోవడంతో విసుగు చెందారు. అటవీ శాఖ అధికారుల బాధితులతో కలిసి సోమవారం సిర్పూర్ అటవీశాఖ కార్యం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.


సిర్పూర్ నియజకవర్గంలో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు అధికం అవుతున్నాయని, కొన్ని రోజుల కిందట సిర్పూర్ బెంగాలీ క్యాంపుకి చెందిన వ్యక్తులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ఆగడాలని కట్టడి చేయాలని, ఎక్కడ చూసినా ఏదో ఒక చోట దౌర్జన్యాలకు పాల్పడడం, డబ్బులు వసూలు చేయడం జరుగుతుందని ఆరోపించారు. 




ప్రభుత్వం అటవీశాఖ పై అధికారులు వెంటనే దౌర్జన్లకు పాల్పడే అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అప్పటివరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు బాధితులతో పాటు బెంగాలీ క్యాంపు గ్రామస్తులు మద్దతు తెలిపారు. 



ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. ‘బెంగాళీ క్యాంప్ నకు చెందిన ఏడుగురు రైతులను అడవి పంది కేసులో అక్రమ కేసులో ఇరికించి, రిమాండ్ చేశారు. 48 గంటలు నిర్బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. కళ్లకు గంతలు కట్టి విచక్షణారహితంగా కొట్టారు. సిర్పూర్ రేంజ్ ఇంచార్జ్, రెబ్బన్ రేంజ్ నుంచి కాగజ్ నగర్ కు వచ్చి ఇబ్బంది పెట్టిన అధికారిని సైతం సస్పెండ్ చేయాలి. భూపాళపల్లి దగ్గర దుప్పి కేసులో బెదిరించి లక్ష రూపాయలు వసూలు చేశారు, కనీసం రశీదు కూడా ఇవ్వలేని బాధితులు చెప్పారు. 250 టేకు చెట్లు డీఎఫ్ఓ ఆధ్వర్యంలో కొట్టారు. ఈ ఫారెస్ట్ మాఫియాకు నాయకత్వం వహిస్తున్న డీఎఫ్ఓను వెంటనే ట్రాన్స్ ఫర్ చేయాలి. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు లేఖ రాశాం. వారు స్పందించి ఈ విషయంలో అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేస్తామని కమిషన్ స్పందించింది. బాధితులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తామని’ స్పష్టం చేశారు.