Adilabad Weather News | ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో, అటు పట్టణాల్లో సైతంఎక్కడ చూసినా కాలనీల్లో ఇంటింటా చలి మంటలు కాగుతూ కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాల్లో నమోదు అవుతున్నాయి. డిజిట్లలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వృద్ధులు, చిన్నారులు, వేకువ జమున లేవలేక పోతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చిరు వ్యాపారులు, వ్యవసాయ రైతులు, ప్రయాణికులు చలి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలితో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ABP Desam ప్రత్యేక కథనం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి రోజు రోజుకూ తీవ్రంగా పెరిగిపోతోంది. ఉమ్మడి జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలు, ఏజెన్సీ ప్రాంత వాసులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిష్ట స్థాయిలో సింగిల్ డిజిట్లలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని అర్లీ (టీ)లో 6.0° డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే జిల్లాలోని బేల,లో 6.3°, పొచ్చేరలో 6.4°, చాప్రాల, నెరడిగొండ, మావల, రాంనగర్ లో 6.6° డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యు)లో 6.7° డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తీర్యాణిలో 6.8°, వాంకిడిలో 7.2°, కేరామేరిలో 7.3° ధనొరలో 7.4° డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
పోటీపడి తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
ఇటూ నిర్మల్ జిల్లాలోని పెంబిలో 6.8° డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కుంటాలలో 7.0°, వానల్ పాడ్ లో 7.4°, కుబిర్, బాసరలో 7.6°, తానుర్ లో 7.8° డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటూ మంచిర్యాల జిల్లాలోని జన్నారంలో 7.2° తపాల్ పూర్ లో 7.3°, భిమారంలో 7.6°, జైపూర్ లో 7.8° డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సింగిల్ డిజిట్ లలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ప్రజలు చలి తీవ్రత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలతోపాటు పట్టణాలలో సైతం ఉదయం వేకువజామున పనులకు వెళ్లేవారు, వ్యవసాయ రైతులు, చిరు వ్యాపారులు, అటు విద్యార్థులు సైతం చలితో వణికి పోతూ.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరిగిపోవడంతో మారముల గ్రామాలలో ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇంటింటా చలిమంటలు కాగుతున్నాయి. చలి తీవ్రత ఎక్కువ అవ్వడంతో వెచ్చదనం కోసం స్వెటర్లు ధరిస్తున్నారు. తలకు తలపాగలు, టువల్లు, చుట్టుకొని ఉపశమనం పొందుతున్నారు. యువకులు సైతం చలి తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలలో పట్టణంలో ఎక్కడ చూసినా వెచ్చదనం కోసం చలి మంటలు కాగుతూ కనిపిస్తున్నారు. ఉదయం పూట చిన్న పిల్లలు, వృద్దులు చలి వల్ల లేవలేక పోతున్నారు. మహిళలు నీళ్లను తీసుకురావాలన్నా, అలుకు చల్లాలన్నా, బోళ్లు దోమాలన్న ఉదయం పూట నీళ్లు అత్యధికంగా చల్లగా ఐస్ వలే ఉంటున్నాయని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పొయ్యిపై మంటలు పెట్టి వేడి నీళ్లు కాగా పెట్టి, ఆ వేడి నీటితోనే మొహాలు కడగడం, స్నానాలు చేయడం, బోళ్ళు సైతం కడగడం జరుగుతుందన్నారు.
ముఖ్యంగా చిన్నారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఉదయం పూట ఆరు గంటలకు లేవాల్సిన వారు చలి తీవ్రత పెరగడంతో ఏడు, ఎనిమిది గంటలకు నిద్ర లేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లాలంటే ఆలస్యం అవుతుందని, కావున ప్రభుత్వం కూడా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి పాఠశాలల సమయం పెంచి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. మరికొన్ని మారుమూల ప్రాంతాల్లో, కొండలు లోయ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసి గూడాలలో చలి తీవ్రత వల్ల ఆదివాసి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెచ్చదనం కోసం చలిమంటలు కాగడంతో పాటు స్వెటర్లు ధరిస్తూ దుప్పట్లు కప్పుకుంటున్నారు. మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు సరైన దుస్తులు, దుప్పట్లు, స్వేటర్లు లేకపోవడంతో చలికి గజగజ వణికిపోతున్నారు. నిరుపేదలైన వారికి స్వెటర్లు దుప్పట్లు, ప్రభుత్వం గానీ ఎవరైనా దాతలు పంపిణీ చేసి చెల్లి నుండి రక్షించుకునేలా ఆదుకోవాలని కోరుతున్నారు.
రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే ఆరు డిగ్రీల నుండి ఐదు డిగ్రీల వరకు కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. త్వరలోనే మూడు, రెండు డిగ్రీలు నమోదవుతాయి. చలి నుండి ప్రజలు రక్షించుకునేలా తగు జాగ్రత్తలు పాటించాలని, స్వేటర్లు, మఫ్లర్లు, బ్లాంకెట్లు వాడుతూ వెచ్చగా ఉండేలా చూసుకోవాలని, చలి తీవ్రత వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, కావున ప్రజలు జగ్రత్తగా ఉండాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు.
Also Read: Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి