Nizamabad News: ప్రకృతిని ప్రేమించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. చెట్లు ప్రగతికి మెట్లు అంటారు. అలా ఏళ్లుగా పెరిగిన చెట్లను తొలగిస్తున్నారని తెలిసి ఓ ప్రకృతి ప్రేమికుడు వాటికి తిరిగి ప్రాణం పోశారు. మనసుంటే మార్గం ఉంటుందని నిరూపించాడు. రొడ్డు వెడల్పులో భాగంగా 70 నుంచి 80 ఏళ్ల పైబడిన పెద్ద పెద్ద చెట్లను రోడ్డు వెడల్పులో భాగంగా తోలగిస్తున్నారు. అయితే ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న ఏన్నారైకి ఓ ఆలోచన వచ్చింది. ఇజ్రాయిల్ లో ఏంత పెద్ద వృక్షాలనైన మరో చోటుకు మార్చడం చూశారు. అయితే ఆదే తరహాలో ఇక్కడ కూడా చెట్లను మరో చోటుకు మార్పించాలని... అందుకు ఆయ్యే ఖర్చుకూడా తానే బరించాలనుకున్నారు. అదే విషయాన్ని స్థానికులకు, అధికారులకు తెలిపారు. దీంతో అంతా ఓకే చెప్పారు. ఇలా 80 నుంచి 90 ఏళ్ల మధ్య ఉన్న సుమారు 12 భారీ చెట్లను... మరో చోటుకు ప్లానిటేషన్ చేశారు. ఇలా ఆ ఎన్నారై ప్రకృతిపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు.
మహా వృక్షాల తొలగింపు విషయం తెలుసుకున్న దేవరాజు..
ఓవైపు సీఎం కేసీఆర్ తెలంగాణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా కోట్ల మొక్కలు నాటిస్తున్నారు. ఆ మొక్కలు మహా వృక్షాలుగా మారాలంటే కనీస 50 ఏళ్లు పట్టొచ్చు. అయితే నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం రోడ్డు వెడల్పులు పనుల్లో భాగంగా మహా వృక్షాలను తొలగించేందుకు సిద్ధమైంది. అయితే అదే గ్రామానికి చెందిన గుగ్గిలం దేవారాజు ఎన్నారై.. ఇజ్రాయిల్ లో గత కొంత కాలంగా ఉద్యోగం చేస్తున్నారు. చెట్లను తొలగిస్తున్నారని స్నేహితుల ద్వారా తెలుసుకున్న ఇజ్రాయిల్ లో వృక్షాలను ఒక చోట నుంచి మరో చోటుకు తీసుకువెళ్లి ప్లానిటేషన్ చేయడo తాను స్వయంగా చూశాడు. అయితే ఇక్కడ కూడా ఈ వృక్షాలను మరో చోటుకు మార్చుదామని అనుకున్నాడు. దీని కోసం ఎంత ఖర్చు అయినా తానే భరిస్తానని చెప్పారు. తన గ్రామంలో తొలగించబడుతున్నటువంటి 15 చెట్లను తన సొంత ఖర్చులతో మరోచోట ప్లానిటేషన్ చేయించారు.
80 ఏళ్ల చెట్లను తొలగించడం చాలా బాధనిచ్చింది..
మొదట చెట్టు చుట్టు పక్కల ఉన్న మట్టి తీసి వేర్లతో వృక్షాన్ని పైకి లిఫ్ట్ చేస్తారు. అదే సైజులో ఈ చెట్టును నాటాలకున్న ప్రాoతoలో గుంత తీసి.. ఆ గుంతో తిరిగి చెట్టును తీసుకు వచ్చి పెడుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల వారు ప్రకృతి ప్రేమికుడు దేవారాజును ప్రశంసిస్తున్నారు. ఒక మొక్క పెట్టి అది మహావృక్షం కావాలంటే ఏళ్లు పడుతుంది. 80 యేళ్ల మహా వృక్షాన్ని అనవసరంగా నాశనం చేయడం తనను చాలా బాధకు గురి చేసిందని ఎన్నారై గుగ్గిలం దేవారాజు అన్నారు. గ్రామంలో రోడ్డు వెడల్పులో భాగంగా పెద్ద పెద్ద చెట్లను తొలగిస్తున్నారని స్నేహితుల ద్వారా తెలుసుకున్నట్లు వివరించారు. అప్పడు తనకు ఇజ్రాయిల్ లో మాదిరిగా ఇక్కడ కూడా చెట్లను తీసుకెళ్లి మరోచోట నాటించవచ్చనే ఆలోచన వచ్చినట్లు వివరించారు. అందుకే చెట్లను రీప్లేస్ చేశామని చెబుతున్నారు.
కమ్మర్ పల్లి గ్రామంలో రోడ్డు వేడల్పులో పెద్ద పెద్ద చెట్టు పోతున్నాయని గ్రామస్థుడు హనుమండ్లు చెబుతున్నారు. ఈ చెట్లు రజాకార్ల జామాన్ లో పెట్టినవని.. ఎనబై నుంచి వంద చెట్లు ఉన్నాయని వివరించారు. అయితే ఈ చెట్లను తొలగిస్తున్నారని తన మిత్రుడు దేవారాజ్ కు చెప్పగా.. అతను స్పందించి ఈ భారీ చెట్లకు పునర్జన్మ ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేవరాజు భారీ చెట్లను తిరిగి నాటించటంపై స్థానికులు ప్రశంసల వెల్లువ కురిపించారు. చెట్లను కాపాడుకోవడం అందరూ బాధ్యతగా తీసుకోవాలని చెబుతున్నారు.