ఎమ్మెల్సీ కవిత లిక్కర్ బోర్డు తెస్తే.. తాను పసుపు బోర్డు తీసుకువచ్చానని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన జగిత్యాల లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతల లాగా తాను కబ్జాలు చేయనని, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వనని, నాలుగు పైసల అవినీతి కూడా తనమీద లేదని, ఉండదని అరవింద్ వ్యాఖ్యానించారు. 


దలారి వ్యవస్థను పెంచింది కాంగ్రెస్ అని, రాజకీయంగా కవిత  తనను అందుకోలేరని అన్నారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తాళలు తెరిపిస్తానని స్పష్టం చేశారు. ఇందూర్ పార్లమెంట్‌లో హుందాతనం రావాలని ధర్మపురి అరవింద్ అన్నారు. పసుపు సనాతన ధర్మమని, పసుపు బోర్డు తన రాజకీయ పునాది అని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎమ్మెల్సీ కవిత తనను అందుకోలేదని ఎద్దేవా చేశారు. 


మళ్లీ రైతులకు పూర్వ వైభవం తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇందూరు పార్లమెంటులో 7 సీట్లను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే దానంత పాపం మరొకటి లేదు అని చెప్పారు. నవంబర్ 30 రాష్ట్రంలో బీఅర్ఎస్ పీడ విరిగిపోతుందని ఎంపీ అరవింద్ విమర్శించారు. రామ రాజ్యం వస్తే సమస్యలన్ని పోతాయని.. తాను కబ్జాలు చేయనని, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వనని చెప్పారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మూడు సార్లు గెలిచిన అవినీతి పరుడని.. ఎస్సైని ట్రాన్స్ఫర్ చేయిస్తే పది లక్షలు, సీఐని ట్రాన్స్ఫర్ చేయిస్తే ఇరవై ఐదు లక్షలు తీసుకుంటాడని విమర్శించారు.


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని వదిలి పెట్టేది లేదని ఎంపీ అర్వింద్ అన్నారు.  మన కొడుకుకో, బిడ్డకో శాపం పెట్టినట్లేనని తెలిపారు. హంగ్ వస్తే ఫస్ట్ జంప్ అయ్యేది రేవంత్ రెడ్డియేనని పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు కాంగ్రెస్ నుంచి కోట్ల రూపాయలు వస్తున్నాయని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కుమార్‌ ఆరోపించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఏర్పాటు చేసిన పసుపు రైతుల కృతజ్ఞత సభకు వెళ్తున్న అర్వింద్‌ వాహనాన్ని జిల్లా సరిహద్దు గండి హనుమాన్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు.


గతంలో రేవంత్ రెడ్డి డబ్బులు సంచుల్లో తరలిస్తే, ఇప్పుడు లారీల్లో తరలిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇరు పార్టీలు ఒకటేనని.. వారి హయాంలో దోపీడీలు తప్ప అభివృద్ధి కనబడదని విమర్శించారు. తెలంగాణ సమాజం.. తమ పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోదీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని ప్రజలకు సూచించారు.


కల్వకుంట్ల కుటుంబం మాటలు తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదు. ప్రధాని మోదీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదు. ప్రధాని మాటలను బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు వక్రీకరిస్తున్నారు. మొదట తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్‌ ఎందుకు వెనక్కి తీసుకుంది. తెలంగాణలో యువత ఆత్మహత్యకు కాంగ్రెస్ కారణం కాదా అని ప్రశ్నించారు. 


ఎమ్మెల్సీ కవిత డ్రామాలు ఆపాలన్నారు. కవిత ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం అని చెప్పారు . మహిళా రిజర్వేషన్‌ బిల్లు గురించి బాగా మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో మహిళల కోసం ఏం చేశారు?. కవిత ముందుగా తెలంగాణలో మహిళలకు మేలు చేయాలని కేసీఆర్‌ను డిమాండ్‌ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌పై ఒత్తిడి తేవాలి అని కామెంట్స్‌ చేశారు.