Mancherial District Collector | మంచిర్యాల: సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో డీసీపీ ఎ.భాస్కర్ తో కలిసి దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామ గిరిజనులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకోవాలని, దాడులకు పాల్పడకూడదని తెలిపారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని దమ్మన్నపేట, మామిడిగూడ గ్రామాలలో జరిగిన ఘటనపై సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా సామరస్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అటవీ ప్రాంతాలలో కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కింద గిరిజనులను వెదురు పంట సాగుకు ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.

Continues below advertisement

అటవీ ప్రాంతాలలోని గిరిజనులు అటవీ భూములలో వెదురు పంట సాగు చేసేందుకు గుంతలు తవ్వడం, మొక్కలకు నీటిని అందించడం, యూరియా ఇతర పనులకు నిధులు మంజూరు చేయడమే కాకుండా వెదురు పంటను విక్రయించుకుని ఆదాయం పొందేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, గిరిజనులు ఆర్థికంగా ఎదిగేందుకు చేయూత అందించనున్నట్లు వెల్లడించారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భౌతిక దాడులకు పాల్పడవద్దన్నారు.

Continues below advertisement

ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో విషాదం.. తల్లి, ముగ్గురు చిన్నారులు మృతి

ప్రమాదవశాత్తు వాగులో పడి తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వాంకిడి మండలంలోని దాబా గ్రామానికి చెందిన మోర్లే బుజ్జి బాయి అనే మహిళ పొలం వద్ద పనిచేస్తున్న సమయంలో ఆమె కుమారుడు గన్ను,తోపాటు మహేశ్వరి, శశికళ అనే మరో ఇద్దరు బాలికలు నీటి కోసం ఓ కుంట వద్దకు వెళ్లారు. అనంతరం వారంతా కుంటలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో చిన్నారులు నీటిలో మునిగిపోయారు.

అది గమనించిన మహిళ.. చిన్నారులను రక్షించేందుకు నీటి గుంతలోకి దిగింది. గుంతలో నీరు, బురద ఎక్కువగా ఉండటంతో ఆమెతో సహా పిల్లలంతా ఇరుక్కుపోయారు. చివరికి ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన వారిని మోర్లే బుజ్జిబాయి (35), మోర్లే గన్ను (12), వాడే మహేశ్వరి(9), అదే శశికళ(9)గా గుర్తించారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.