Komaram Bheem District News: కుమ్రంభీమ్ జిల్లాలో ప్రజలకు బిగ్ రిలీఫ్. గత కాలంగా పరుగులు పెట్టిస్తున్న పులిని అధికారులు బంధించారు. సిర్పూర్ మండలం మకాడి సమీపంలో అధికారులకు పులి చిక్కింది. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా రాజురా తాలుక అంతర్గాం – అత్మారాం గూడలో పులి అధికారులు పట్టుకున్నారు.
నాటకీయ పరిణామాల మధ్య పులిని అధికారులు బంధించారు. సిర్పూర్‌లో ప్రజలకు ముప్పుతిప్పలు పెట్టినట్టుగానే ఆ మండలానికి సరిహద్దున ఉన్న మహారాష్ట్ర ప్రజలను కూడా భయపెట్టింది. దీంతో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. పశువుపై దాడి చేసి తింటున్న పులిని మాటు వేసి మత్తు ఇంజెక్షన్ షూట్ చేసి స్పృహతప్పేలా చేశారు.
నెల రోజులుగా కుమ్రం భీం జిల్లా ప్రజలకు కంటి మీద కనుకు లేకుండా చేసిన పులిగా గుర్తించారు. గత నెలలో ఇద్దరు రైతులపై దాడి చేసింది ఇదేనని నిర్దారించారు. చాలా రోజుల క్రితం ఆడపులి కోసం వెతుకుతూ ఇలా జనావాసంలోకి వచ్చిందీ పులి. అప్పటి నుంచి కనిపించిన పశువులను మనుషులపై అటాక్ చేస్తూ అందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తోంది.