దోమకొండ: కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. పెద్దపులి రోజుకో మండలంలో ఫారెస్ట్ ప్రాంతాల్లో సంచరిస్తూ గ్రామ శివారు ప్రాంతాల్లో మూగజీవాలపై దాడి చేయడంతో ఆయా మండలాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని పాల్వంచ, బిక్కనూర్, దోమకొండ మండలాల్లో పెద్దపులి వరుసగా 4 రోజులుగా మూగ జీవాలపై దాడి చేయడంతో ఆయా మండలాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామ శివారులోని అన్నారం ఒడ్డెర కాలనీ సందు కట్టులో రాత్రి గేదెపై పెద్దపులి దాడి చేసి చంపివేసినంది. దీంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు పెద్దపులి వేలిముద్రలను సేకరించారు. మొదట దోమకొండ మండలం అంబార్ పెట్ గ్రామంలో దూడలపై పెద్దపులి దాడి చేసి చంపి వేసింది. అలాగే దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డికి చెందిన ఓ రైతుకు చెందిన దూడలపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. పులి సంచారంతో దోమకొండ, బిక్కనూర్ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు.
ట్రాప్ కెమెరాలు ఏర్పాటుముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, గొర్రెల, మేకల కాపరులు సైతం పెద్దపులి ఎప్పుడు వచ్చి దాడి చేస్తుందోనని భయపడుతున్నారు. పెద్దపులి పశువులపై దాడి చేస్తూ హత మారుస్తూ ఆయా గ్రామ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ విషయంపై అటవీ శాఖ అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పెద్దపులి పాదముద్రాలు సేకరించారు. అలాగే పెద్దపులి దాడి చేసిన ప్రదేశాలలో ట్రాక్ కెమెరాలను అమర్చారు.
పరిశీలించిన ఎస్‌డీఓపెద్దపులి దాడి చేసిన ప్రాంతాలను కామారెడ్డి F D O రామక్రిష్ణ పరిశీలించారు. పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్దపులి కదలికలపై మూడు బృందాలుగా అటవీశాఖ అధికారులు ఫారెస్ట్ లోనే మకాం వేశారు. ఎవరికైనా పెద్ద పులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని F D O రామక్రిష్ణ కోరారు. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ సర్పంచులు దండోరా వేయించారు.