GO 49 In Telangana | ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ జోన్ జీఓ నం.49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను మంత్రి సీతక్క హామీతో విరమించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తలపెట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు మంగళవారం సాయంత్రం అడిషనల్ కలెక్టర్ వెళ్ళి నిమ్మ రసం ఇచ్చి వారి దీక్షను విరమణ చేయించారు.

అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంటేష్ దొత్రే తో కలిసి మాట్లాడారు. రాజ్ గోండు సేవ సమితి, గొండ్వాన పంచాయతీ రాజ్ సెంటర్ జిల్లా మేడి, జాతీయ నాయకులు సిడాం అర్జు గారినీ మంత్రి సీతక్కతో ఫోన్ ద్వారా మాట్లాడించారు. మీ సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాయనీ అన్నారు. అలాగే టైగర్ జోన్ జీవో నం.49 రద్దు కోసం మంత్రి సీతక్క ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ లతో తీర్మానం చేశారని తెలిపారు. రోడ్లు, అటవీ భూముల సమస్యలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి, అంగవాడి, పాఠశాలు నిర్మాణానికీ అటవీ శాఖతో మాట్లాడి పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాజ్ గోండు సేవ సమితి జిల్లా అధ్యక్షులు మడావి శ్రీనివాస్,  ప్రధాన కార్యదర్శి మడావి నర్సింగ్ రావు, సర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులు మడావి గుణవంత్ రావు, తిర్యాణి సార్ మేడి ఆడ తాను, నాయకులు టెకం గంగారాం, ఆసిఫాబాద్ మండల సార్ మేడి  కోర్కెట నానేశ్వర్, సిడం సూరు మాస్టారు, దాసరి విజయ మహిళా ఆదర్శ సంఘం అధ్యక్షులు, స్థానిక సీఐ, రెవిన్యూ డివిజన్ అధికారి, బావునే బాపూరావు తదితరులు పాల్గొన్నారు.