Telangana News | హైదరాబాద్: జీవో 49 ను రద్దు చేయాలని తీర్మానం సహా గిరిజన ఎమ్మెల్యేల సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు. గ్రామసభల అనుమతులు లేకుండా ఏకపక్షంగా జీవో 49 ని విడుదల చేయడాన్ని గిరిజన ఎమ్మెల్యేల సమావేశంలో తప్పుపట్టారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్‌లో ట్రైబల్ డిపార్ట్మెంట్‌పై ఎస్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లతో మంత్రి సీతక్క (Seethakka) సమావేశమయ్యారు. రాజీవ్ యువ వికాసం, ఇందిర సౌర సిరి జల వికాసం, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలపై ప్రధానంగా చర్చ జరిగింది. మంత్రి సీతక్క, ఎస్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్ ను శాలువాతో సత్కరించారు. ట్రైబల్ శాఖకు ఇటీవల బడ్జెట్ లో 6230 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు.
ఫారెస్ట్ శాఖ జీవో రద్దు చేయాలి
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తడోబా టైగర్ రిజర్వ్ (Tiger Reserve) నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కొమురం భీం కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటిస్తూ తెలంగాణ పర్యావరణ, అటవీ శాఖ జారీ చేసిన జీవో 49 ని రద్దు చేయాలని గిరిజన ఎమ్మెల్యేల సమావేశంలో తీర్మానం చేశాం. గ్రామసభల అనుమతులు లేకుండా టైగర్‌జోన్ ఏర్పాటు కోసం తీసుకువచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఫారెస్ట్ శాఖ వాళ్ళు ఈ జీవో ను వెనక్కి తీసుకోవాలి. ట్రైబల్ లో చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి అని ఎమ్మెల్యేలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలను నేను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్తాను. ఇలాంటి మీటింగ్ లు గిరిజనులకు ఎంతో అవసరం. త్వరలో ఎస్టి ఎమ్మెల్యేలు సీఎంను కలిసి సమస్యలు చెబుతాం. గిరిజనులకి ప్రత్యేకంగా ఇళ్ళు ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
ప్లైన్ ఏరియా itda లు కొత్త వి ఏర్పాటు చేయాలి. ఐటీడీఏ (Itda) లను బలోపేతం చేయాలి. ట్రైబల్ శాఖ ను మరింత బలోపేతం చేయాలి. ప్రజల ఆమోదం గ్రామ సభ ఆమోదం లేకుండా ఫారెస్ట్ వాళ్ళు ఏం చేయొద్దు. శాఖల వారిగా ఎమ్మెల్యేలు నుంచి పెండింగ్ సమస్యలు లిస్ట్ రెడీ చేసి సీఎంకి అందచేస్తాం. తరువాత సమావేశానికి మిగతా ఎస్టి ఎమ్మెల్యేలు రావాలని కోరుతున్నాం. రాష్ట్ర సగటు కంటే ట్రైబల్ లో 98 శాతం రిజల్ట్స్ వచ్చాయి. పిల్లలకు ల్యాప్ టాప్స్ ఇవాలి. ఆశ్రమ స్కూల్స్ అప్ గ్రేడ్ చేయాలి.
ఇతర సంప్రదాయాలు మా మీద రుద్దుతున్నరు
ఎస్టి ఎస్డీఎఫ్ ఫండ్స్ ఉపయోగించుకోవాలి. బీటీ, సీసీ రోడ్స్ అవసరం ఉంది. బిల్స్ పెండింగ్ లో ఉండటంతో ట్రైబల్ ఏరియాలో పనులు జరగడం లేదు. సాంస్కృతిక శాఖ తో మన కళలను కాపాడుకోవాలి. పుట్టుక నుంచి మరణం వరకు ఆచార సంప్రదాయాలను రీసెర్చ్ స్కాలర్స్ తో ఆడియో వీడియో రూపంలో రెడీ చేయాలి. మన మీద ఇతర సంప్రదాయాలు బలవంతంగా రుద్దుతున్నరు. భద్రాచలంలో ట్రైబల్ పిఓ మ్యూజియం ఏర్పాటు చేశారు. Itda ల పరిధిలో మ్యూజియాలు, లైబ్రరీ లు ఏర్పాటు చేయాలి
జాబ్ మెలా లు ఏర్పాటు చేయాలి. త్రిబాల్స్ ఏరియాల్లో జాబ్ మెలా లు ఏర్పాటు చేస్తే నియోజకవర్గ మ్ కి వేయి మంది జాబ్ లు వచ్చిన మేలు జరుగుతుంది. వచ్చే నెల లో మహుబబాద్ లో జాబ్ మెలా ఉంది. అదిలాబాద్ అసిఫాబాద్ లో కూడా ఏర్పాటు చేద్దాం’ అన్నారు మంత్రి సీతక్క. ఎస్టీ ఎమ్మెల్యేల సమావేశానికి హాజరైన వారిలో ట్రైబల్ సెక్రటరీ శరత్, ఎస్టి గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మీ , అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, జిసిసి, ట్రైబల్ అధికారులు, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, ఎడ్మ బొజ్జు, కోవ లక్ష్మీ, అనిల్ జాదవ్, ఆదినారాయణ, కార్పొరేషన్ చైర్మైన్లు బెల్లయ్య నాయక్, కోట్నాక్ తిరుపతి ఉన్నారు.
కాగా, ఆదివాసీలకు ఇబ్బంది కలిగించే జీవో 49ని రద్దు చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నక విజయ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.