Ganesh Nimajjanam: మద్యం మత్తులో ఉంటే అనుమతించొద్దు, డీజేలకు నో ఛాన్స్ - గణేష్ నిమజ్జనంపై పోలీసుల ఆంక్షలు

Ganesh Visarjan Date time 2024 | వినాయక నిమజ్జన వేడుకల్ని ప్రశాంతంగా నిర్వహించాలని పోలీసులు సూచించారు. ఐజి చంద్రశేఖర్ రెడ్డి శనివారం నిర్మల్ కు వచ్చి పోలీసులకు పలు సూచనలు చేశారు.

Continues below advertisement

Ganesh Visarjan 2024 Date and Time | నిర్మల్ జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించాలని మల్టీజోన్ (1) ఐజి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. భైంసా మరియు నిర్మల్ లో జరగనున్న గణపతి నిమజ్జనం (Vinayaka Nimajjanam) సందర్భంగా ఐజి చంద్రశేఖర్ రెడ్డి శనివారం నిర్మల్ కు విచ్చేసిన సందర్బంగా జిల్లా పొలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.

Continues below advertisement

అధిక సౌండ్ నిచ్చే డీజే లు, పక్క రాష్ట్రాల నుండి వచ్చే డీజేలు పెట్టనివ్వ్వద్దని చెప్పారు. నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా బాణాసంచా కాల్చడం వంటివి చేయకుండా చూడాలన్నారు. లేజర్ లైట్స్ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి. డీజే వాహనం పైన పేపర్ ముక్కలు విసిరే మోటార్ నీ వద్దని ప్రజలకు సూచించారు. ఇలాంటి వాటిని వాడితే వారి మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మద్యం మత్తులో ఉన్న వారిని అనుమతించవద్దు

విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలపై మద్యం మత్తులో ఉన్నవారిని అనుమతించ కూడదని ఇట్టి విషయాన్ని ఉత్సవ కమిటీ నిర్వాహకులకు తెలియజేయాలన్నారు. రెచ్చగొట్టే నినాదాలు చేయడం, మత స్థలాల దగ్గర ఊరేగింపులను ఆపడం వంటివి చేయవద్దని హెచ్చరించారు. కనుల పండుగగా జరుగు గణేష్ నిమజ్జన యాత్రను ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. ఎవరు కూడా ఇతర భక్తులకు కానీ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించవద్దని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.

ప్రతి విగ్రహం ఉదయమే బయలు దేరాలని, వాహనాలపై పరిమితికి మించి వెళ్ళకూడదన్నారు. ఊరేగింపు సమయంలో కరెంటు తీగలను గమనించి వాహనాన్ని నడపాలని, నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్లేటప్పుడు రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయకూడన్నారు. వాహనాలకు తగిన దారి ఉండేలా ఉత్సవ కమిటీ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

ప్రజలు శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకునేందుకు ముందస్తు ప్రణాళికతో పోలీస్ అధికారులు అన్ని శాఖల అధికారులతో కలిసి పనిచేయాలని సూచించారు. నిర్మల్, భైంసా పట్టణాలలో ముఖ్యమైన ప్రాంతాలలో సి.సి కెమెరాల ఏర్పాటు చేయడం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా గణేష్ నిమజ్జనం రూట్లో సి.సి కెమెరాల ఏర్పాటు చేశామని, ఈ కెమెరాలు సోలార్ తో కూడా పనిచేసేలా ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు పూర్తిగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేశారని, ఈ సీసీటీవీలు 24×7 ప్రకారంగా పూర్తిగా సిబ్బంది పర్యవేక్షణలో ఉంటాయి.

నిమజ్జనం రోజు ఆయా రూట్లలో విద్యుత్‌ శాఖ, ఆర్‌ అండ్‌బీ శాఖలు, ఇతర శాఖల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమం సాఫీగా సాగేలా చర్యలు చేపట్టామని, గణేష్ నిమజ్జనం చేయడానికి భద్రతాపరమైన పూర్తి సన్నాహాలు చేసినట్లు జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల,తో పాటు, డిఎస్పీ గంగారెడ్డి, సీఐ,లు నవీన్, ప్రవీణ్, రామకృష్ణ, అశోక్, అర్ ఐ లు శేఖర్, రమేష్, రామ కృష్ణ, ఆర్ఎస్ఐ లు  పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Also Read: Ganesha Nimajjanam 2024: గణేష్ నిమజ్జనం సమయంలో చేయాల్సినవి చేయకూడనివి ఇవే!

Continues below advertisement
Sponsored Links by Taboola