Fight between Congress leaders in Asifabad District | ఆసిఫాబాద్: బీసీ కుల గణనకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు అభిప్రాయ భేదాలు రావడంతో పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. పిడిగుద్దులతో అవతలి వర్గం వారిపై తమ ప్రతాపం చూపించడంతో ఉద్రికత్త చోటుచేసుకుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఈ ఘటన జరిగింది.
కనీసం సమాచారం ఇవ్వలేదంటూ గొడవ మొదలైంది..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బీసీ కుల గణన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆసిఫాబాద్ లోని రోజ్ గార్డెన్ లో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతున్న క్రమంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లా DCC అద్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, నియోజకవర్గ ఇన్చార్జి శ్యామ్ నాయక్ వర్గాల మద్య రచ్చ మొదలయ్యింది. తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని శ్యామ్ నాయక్ వర్గం ఆరోపించింది. తాము అందరికీ సమాచారం ఇచ్చామని విశ్వప్రసాద్ వర్గం చెప్పడంతో గొడవ మొదలైంది. సమావేశంలో కార్యకర్తలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. గాల్లోకి కుర్చీలు లేచాయి. ఇరువురు పిడిగుద్దులు గుద్దుకున్నారు. పరస్పరం వ్యతిరేక నినాదాలతో గందర గోళ పరిస్థితి ఏర్పడింది.
అనంతరం డీసీసీ అధ్యక్షున్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యామ్ నాయక్ బయటకు వెళ్లి రోడ్డుపై బైఠాయించారు. లోపల సమావేశం, బయట ఆందోళన మద్య సమావేశం సాగుతోంది. పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు శ్యామ్ నాయక్ ను నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేశారు. ఆయినా శ్యామ్ నాయక్ తన ఆందోళన విరమించలేదు. ఒకానొక దశలో మీటింగు హాల్ లోకి ఆయన వర్గం దూసుకువెళ్లేందుకు ప్రయత్నం కూడా చేశారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
రెండు గ్రూపుల మధ్య జరిగిన కుమ్ములాట రాబోయే రోజుల్లో పార్టీలో ఇది ఎక్కడికి తెస్తుందో... ఆసిఫాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో అని నాయకులు చర్చించుకుంటున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాంటే వేచి చూడాలి. కాంగ్రెస్ పార్టీలో పలు జిల్లాల్లో ఇలా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో గొడవలు జరిగేవి, కానీ వెంటనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు నేతల్ని కంట్రోల్ చేసేవారు.
Also Read: Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం